తెప్పకాడు ఏనుగుల క్యాంప్: బొమ్మన్, బెల్లీ దంపతులను కలిసిన మోడీ

Published : Apr 09, 2023, 01:53 PM IST
 తెప్పకాడు  ఏనుగుల క్యాంప్: బొమ్మన్, బెల్లీ దంపతులను  కలిసిన మోడీ

సారాంశం

ఆస్కార్ అవార్డు  పొందిన  ది ఎలిఫెంట్  విస్పరర్స్   డాక్యుమెంటరీకి ప్రేరణగా  నిలిచిన దంపతులను మోడీ ఇవాళ కలిశారు.  తెప్పకాడు  ఏనుగుల క్యాంపు వద్ద బొమ్మన్, బెల్లీ  దంపతులను మోడీ కలిశారు. 


చెన్నై :ది ఎలిఫెంట్  విస్పరర్స్  అనే  డాక్కుమెంటరీకి  అస్కార్ అవార్డు దక్కింది.ఈ డాక్యుమెంటరీ కొ బొమ్మన్,  బెల్లీ దంపతులు ప్రేరణ,. 
బొమ్మన్, బెల్లీ దంపతులను  ప్రధాని నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  కలుసుకున్నారు.  తమిళనాడు  రాష్ట్రంలోని  ముదుమలై  టైగర్ రిజర్వ్ లో గల  తెప్పకాడు ఏనుగుల  క్యాంపు వద్ద  ప్రధాని  బొమ్మన్, బెల్లీ దంపతులను కలిశారు. 

also read:ముదమలై టెగర్ రిజర్వ్‌: ఏనుగులకు ఆహారం అందించిన మోడీ

బొమ్మన్ దంపతులను  కలిసిన  విషయాన్ని మోడీ సోషల్ మీడియాలో  పంచుకున్నారు.  బొమ్మన్, బెల్లీ,  రఘు(ఏనుగు(ను కలుసుకోవడం ఆనందంగా  ఉందని మోడీ  సోషల్ మీడియాలో  పేర్కొన్నారు. 

 

ఇవాళ ఉదయం  కర్ణాటకలోని  బండీపూర్ రిజర్వ్ లో మోడీ  పర్యటించారు. ఈ టైగర్ రిజర్వ్  ప్రారంభించి  50 ఏళ్లు పూర్తైన  సందర్భంగా  మోడీ  ఈ టైగర్ రిజర్వ్ లో  పర్యటించారు.  20 కి.మీ.  టైగర్ రిజర్వ్ లో  జీపులో ప్రయాణించారు.  

 

అనంతరం తమిళనాడులోని  ముదమలై  టైగర్ రిజర్వ్ లో  మోడీ  పర్యటించారు. తెప్పకాడు  ఏనుగుల క్యాంపు వద్ద  బొమ్మన్, బెల్లీ దంపతులతో  మోడీ  మాట్లాడారు.   ఈ ఫోటోలు, వీడియోలో  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?