ఝూన్సీ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు : ఇంతకూ వారేం చేసారో తెలుసా?

By Arun Kumar P  |  First Published Sep 30, 2024, 5:30 PM IST

ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'లో జాన్సీ జిల్లా మహిళల జల సంరక్షణ కృషిని ప్రశంసించారు. చనిపోయిన గుర్రారి నదిని పునరుజ్జీవింపజేసిన 'జల సఖులు' కృషికి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ ప్రయత్నం బుందేల్‌ఖండ్‌లో జల సంరక్షణకు ప్రేరణగా నిలిచింది.


లక్నో : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న జల సంరక్షణ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మహిళలు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.  నీటి కొరతతో బాధపడుతున్న బుందేల్‌ఖండ్ ప్రాంతంలో స్వయం సహాయక బృందాల మహిళలు చేస్తున్న కృషిని తన కార్యక్రమంలో ప్రస్తావించినందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఝాన్సీలోని కొంతమంది మహిళలు గుర్రారి నదికి పునరుజ్జీవం తీసుకొచ్చారని ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో అన్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులైన ఈ మహిళలు 'జల సఖులు'గా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు.  అంతరించిపోయే దశలో వున్న గుర్రారి నదిని వారు కాపాడతారని ఎవరూ ఊహించి ఉండరని ఆయన అన్నారు. బస్తాలలో ఇసుక నింపి చెక్ డ్యామ్‌లను నిర్మించారు. వర్షపు నీరు వృధా కాకుండా అడ్డుకుని నదిని నిండుగా మార్చారనిప్రదాని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజల నీటి సమస్య తీరడమే కాకుండా వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు. స్త్రీ శక్తి ఎక్కడ ఉంటే అక్కడ జలశక్తి పెరుగుతుంది... జలశక్తి స్త్రీ శక్తిని బలోపేతం చేస్తుందని ప్రధాని అన్నారు.

Latest Videos

undefined

ఝాన్సీలోని బబీనా బ్లాక్‌లోని సిమ్రావరి గ్రామానికి చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. గుర్రారి నదిని పునరుజ్జీవింపజేయడానికి వారు ఆరు రోజుల పాటు శ్రమదానం చేశారు. బస్తాలలో ఇసుక నింపి నదికి అడ్డుగా ఉంచి డ్యామ్‌ను నిర్మించి నదిని నిండుగా మార్చారు. ఇలా వీరు కేవలం ఒక నదిని పునరుజ్జీవింపజేయడమే కాకుండా సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. నదిలో నిల్వ చేసిన నీటిని స్థానికులు నిత్యావసరాలకు, పశువులు తాగడానికి ఉపయోగించుకుంటున్నారు.

ఝాన్సీలోనే కాదు యోగి ప్రభుత్వం మొత్తం బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జల సంరక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది. అన్ని సవాళ్లను అధిగమించి బుందేల్‌ఖండ్‌లోని చాలా కుటుంబాలకు నీటి కనెక్షన్లు అందించింది. యోగి ప్రభుత్వం 'హర్ ఘర్ నల్ సే జల్' పథకం ద్వారా 95 శాతం ఇళ్లకు కుళాయి ద్వారా నీటి సరఫరాను నిర్ధారిస్తోంది. అదేవిధంగా గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల ఏర్పాటు, జలాశయాల శుభ్రత వంటి చర్యలు చేపట్టింది. అంతేకాకుండా యోగి ప్రభుత్వం రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలను కూడా ప్రోత్సహిస్తోంది.

జల సంరక్షణ రంగంలో చేస్తున్న కృషికిగాను జల సఖులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు సత్కరించాయి. బుందేల్‌ఖండ్‌లో జల సంరక్షణ కార్యక్రమాల్లో ఈ జల సఖులు ప్రభుత్వానికి నిరంతరం సహకరిస్తున్నాయి. జల సంరక్షణపై అవగాహన కల్పించడంలో కూడా ఈ జల సఖులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

జల సంరక్షణకు ప్రేరణగా నిలిచిన మాతృశక్తిని సీఎం యోగి  అభినందనలు

జల సంరక్షణకు ప్రేరణగా నిలిచిన మాతృశక్తిని అభినందిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఝాన్సీ జిల్లాకు చెందిన స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు 'జల సఖులు'గా మారి గుర్రారి నదిని పరిరక్షించడం, పునరుజ్జీవింపజేయడం కోసం చేసిన ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రస్తావించడం మొత్తం ఉత్తరప్రదేశ్‌కు గర్వకారణమని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.

వందలాది జలాశయాల నిర్మాణంలో పాల్గొని మహిళా సాధికారతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిన ఈ 'జల సఖులు' అనేక సవాళ్లను ఎదుర్కొంటూ జల సంరక్షణ, అభివృద్ధికి ఒక అద్భుతమైన ఉదాహరణను చూపించారని ఆయన కొనియాడారు. జల సంరక్షణకు ప్రేరణగా నిలిచిన మాతృశక్తికి హృదయపూర్వక అభినందనలు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అని యూపీ సీఎం యోగి అన్నారు. 

 

 

click me!