Kerala bishop arrest: అక్రమ ఇసుక తవ్వకాలు.. తమిళనాడులో అరెస్టైన కేరళ బిషప్ !

Published : Feb 08, 2022, 01:37 PM ISTUpdated : Feb 08, 2022, 01:46 PM IST
Kerala bishop arrest: అక్రమ ఇసుక తవ్వకాలు..  తమిళనాడులో అరెస్టైన కేరళ బిషప్ !

సారాంశం

Kerala bishop arreste: తామరభరణి నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై పతనంతిట్ట లోని మలంకర క్యాథలిక్ చర్చి బిషప్ శామ్యూల్ మార్ ఇరేనియోస్‌ను తమిళనాడులో క్రైమ్ బ్రాంచ్  పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు వికార్ జనరల్ ఫాదర్ షాజీ థామస్, ఫాదర్ జోస్ చమకాల, ఫాదర్ జార్జ్ శామ్యూల్, ఫాదర్ జిజో జేమ్స్, ఫాదర్ జోస్ కలైల్ తదితరులు అరెస్టయ్యారు. నిందితులందరినీ రిమాండ్‌కు తరలించారు.  

Kerala bishop arreste: తిరునెల్వేలిలోని అంబసముద్రం(Amba Samudram)..తామిరభరణి నది ఒడ్డున అక్రమంగా ఇసుక త‌వ్వ‌కాలు, అక్ర‌మంగా ర‌వాణా చేశారన్న ఆరోపణలపై పతనంతిట్ట (Pathanamthitta) లోని మలంకర క్యాథలిక్ చర్చి బిషప్ శామ్యూల్ మార్ ఇరేనియోస్ (Bishop Samuel Mar Irenios)ను తమిళనాడు (Tamil Nadu)లో క్రైమ్ బ్రాంచ్  (Crime Branch CID) పోలీసులు అరెస్టు చేశారు.  వీరిలో పాటు వికార్ జనరల్ ఫాదర్ షాజీ థామస్, ఫాదర్ జోస్ చమకాల, ఫాదర్ జార్జ్ శామ్యూల్, ఫాదర్ జిజో జేమ్స్, ఫాదర్ జోస్ కలైల్ తదితరులు అరెస్టయ్యారు. నిందితులందరినీ రిమాండ్‌కు తరలించారు. 

కాగా, అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల‌కు సంబంధించిన ఈ కేసులో గతంలో చర్చి భూమిని లీజుకు తీసుకున్న కొట్టాయంకు చెందిన మాన్యువల్ జార్జ్‌ను అరెస్టు చేశారు.  తిరునల్వేలి (Tirunelveli) లోని సౌత్ కల్లిడైకురిచ్చి గ్రామంలోని పొట్టల్ వద్ద చెక్ డ్యామ్‌కు ఆనుకుని ఉన్న 300 ఎకరాల స్థలంలో మాన్యువల్ రఫ్ స్టోన్ (rough stone), గ్రావెల్ (gravel), క్రషర్ డస్ట్ (crusher dust) మరియు ఎం-ఇసుక (M-sand)ను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, వినియోగించడానికి లైసెన్స్ పొందినట్లు పోలీసులు తెలిపారు. పతనంతిట్ట మలంకర కాథలిక్ చర్చి (Malankara Catholic Church) డియోసెస్ యాజమాన్యంలో ఉంది. ఇది మాన్యువల్ జార్జ్‌కు లీజుకు ఇవ్వబడింది. వండల్ చెక్ డ్యామ్ (Vandal check dam), సమీప ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారు. అయితే, చాలా కాలం నుంచి ఇసుక అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానికులు, పర్యావరణవేత్తలు ఉద్యమిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తామిరభరణి (Thamarabharani river) నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై తొలిసారిగా పర్యావరణవేత్తలు (environmentalists) ఫిర్యాదు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించారు. కలెక్టర్ నివేదిక ప్రకారం సుమారు 27,700 క్యూబిక్ అడుగుల ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డ్డ‌ర‌ని గుర్తించారు. రూ.9 కోట్ల జరిమానా విధించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి  నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఓ పోలీసు అధికారిని కూడా సస్పెండ్ చేశారు. అయినప్ప‌టికీ.. ఈ అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు కొన‌సాగుతుండ‌టంతో  పర్యావరణ కార్యకర్తలు హైకోర్టు (court)ను ఆశ్రయించారు. 

ఈ నేపథ్యంలోనే నిందితులను అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు CB-CIDని ఆదేశించింది. అయితే,  కోవిడ్ మహమ్మారి (Coronavirus) కారణంగా, వారు దాదాపు రెండేళ్లపాటు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే సదరు కాంట్రాక్టర్ ఇసుకను అక్రమంగా తవ్వాడు. అతను ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన తర్వాత అతనిని ఒప్పందం నుండి తొలగించడానికి చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు సైరో మలబార్ వర్గాలు (church statement) ప్రకటనలో పేర్కొంది. 

300 ఎకరాల భూమిని వ్యవసాయానికి వినియోగిస్తుండగా, గతంలో అక్కడ కొబ్బరి, జామ సాగు చేసేవారు. "తరువాత, వ్యవసాయం కోసం కొట్టాయం వాసికి కౌలుకు ఇచ్చారు. కానీ అతను తమకు తెలియకుండా అక్రమాలకు పాల్పడ్డాడు. టైటిల్ డీడ్లు లేని పక్కనే ఉన్న ప్లాట్లలో ఇసుక తవ్వకాలు జరిపాడు. బిషప్, ఫాదర్లను విచారణ కోసం పిలిచారు" అని  డియోసెస్ సీనియర్ ఫాదర్ అన్నారు. అరెస్టు తర్వాత, సీనియర్ డియోసెస్ అధికారులు ఆదివారం తిరునల్వేలికి చేరుకున్నారు. బెయిల్‌ పిటిషన్‌ దాఖలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు  తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu