Noida International Airport ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వే అవుతుంది.. శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ

By team teluguFirst Published Nov 25, 2021, 3:29 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధానగర్​లోని జెవార్​లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు (Noida International Airport) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం శంకుస్థాప చేశారు. ఈ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వే (logistics gateway of northern India) అవుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 

ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధానగర్​లోని జెవార్​లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు (Noida International Airport) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం శంకుస్థాప చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన కార్యాక్రమంలో ప్రధాని మోదీతో పాటు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నోయిడా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని కోట్లాది మందికి లబ్ది చేకూరుతుందన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్స్ గేట్‌వే (logistics gateway of northern India) అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఇతర దేశాలలో విమానాల మరమ్మతుల కోసం ప్రతి ఏడాది రూ. 15,000 కోట్లు వెచ్చిస్తున్నామని మోదీ తెలిపారు. ఇప్పుడు అన్ని మరమ్మతులు, నిర్వహణ ఇక్కడే నిర్వహిస్తారని చెప్పారు. ఈ విమాశ్రయం యూపీ ఎగుమతులను పెంచుతుందని అన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు. మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ కారణంగా రాష్ట్రంలో పర్యాటక రంగం  మరింతగా వృద్ది చెందుతుందని మోదీ తెలిపారు. 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. తొలిసారిగా తమ డబుల్ ఇంజన్ ప్రభుత్వం (Double-engine govt) ఉత్తరప్రదేశ్‌ని అభివృద్ది బాటలో పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. ఇంతకు ముందు యూపీలో అధ్వానమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు లేక, మాఫియా.. వంటి వాటితో విమర్శలు ఎదుర్కొనేదని అన్నారు. గత ప్రభుత్వాలు యూపీని పేద రాష్ట్రంగా ఉంచాయని అన్నారు. నేడు యూపీలో అభివృద్ది జరుగుతుందని.. అది గ్లోబల్ స్థాయిలో తనదైన ముద్రను కలిగి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. 

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు పశ్చిమ యూపీ అభివృద్ధిని విస్మరించాయని ఆరోపించారు. గత రాష్ట్ర ప్రభుత్వం జేవార్ విమానాశ్రయ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని కేంద్రానికి లేఖలు రాసిందని అన్నారు. గతంలో ప్రాజెక్టుల గురించి ప్రకటించేవారని.. కానీ క్షేత్ర స్థాయిలో పనులు జరిగేవి కావని అన్నారు. విపరీతంగా ఖర్చులు పెంచేసేవారని విమర్శించారు. తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిందని చెప్పారు.

 

ఇంతకు ముందు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చే రైతులు.. పరిహారం పొందడానికి ఏళ్ల తరబడి వేచి ఉండేవారని.. కానీ తాము సకాలంలో పరిహారం అందేలా చూస్తున్నామని చెప్పారు. వారి భూములకు సరైన పరిహారాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు. 

ఇక, ఇప్పటికే నోయిడా విమానాశ్రయం కోసం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2024 ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశ అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే దేశంలోనే ఐదు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు కలిగిన ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు పొందనుంది. ఇది నేషనల్ క్యాపిట ల్ రీజియన్(ఎన్సీఆర్)లో రెండో ఎయిర్ పోర్టు కానుంది. ఈ విమానాశ్రయాన్ని 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించనుండా.. ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థంతో సౌకర్యాలను కల్పిస్తున్నారు.

click me!