కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికలు: అభ్యర్ధులంతా కోటీశ్వరులే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే..?

By Siva KodatiFirst Published Nov 25, 2021, 2:36 PM IST
Highlights

కర్ణాటక (karnataka) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు (mlc elections) సంబంధించి బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యధికులు కోటీశ్వరులే కావడం విశేషం. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు.

కర్ణాటక (karnataka) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు (mlc elections) సంబంధించి బరిలోకి దిగిన అభ్యర్థుల్లో అత్యధికులు కోటీశ్వరులే కావడం విశేషం. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. బెంగళూరు నగర జిల్లా నుంచి బీజేపీ (bjp) అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన హెచ్‌ఎస్ గోపీనాథ్‌ (hs gopinath) రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద రూ.42.40 కోట్ల స్థిరాస్తి, రూ.5.44 కోట్ల చరాస్తి ఉన్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన యూసుఫ్‌ షరీఫ్‌ (కేజీఎఫ్‌ బాబు) (yusuf shariff) తన వద్ద రూ.1,743 కోట్ల స్థిరాస్తి ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో 97.98 కోట్ల స్థిరాస్తి కాగా రూ.1,643.59 కోట్ల చరాస్తి ఉన్నట్టు పేర్కొన్నారు. 

చిత్రదుర్గ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన బీ సోమశేఖర్‌ (soma sekhar) తన వద్ద రూ.116 కోట్ల ఆస్తి ఉందని, భార్య పేరిట రూ.23 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.35 కోట్లు చరాస్తి కాగా రూ.80 కోట్లు స్థిరాస్తి. 5 బ్యాంకులలో కలిపి రూ.6.32 కోట్లు డిపాజిట్‌లుగా ఉంచినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బళ్లారి జిల్లా (bellary) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎచరెడ్డి సతీశ్‌ (echareddy satheesh) తనకు, కుటుంబ సభ్యుల పేరిట రూ.93.09 కోట్ల చరాస్తి, రూ.43.99 కోట్ల స్థిరాస్తి ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలోనే మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలు తప్పనిసరిగా సమర్పించాలన్న నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో అభ్యర్ధులు ఆస్తుల చిట్టా బయటపెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. 

Also Read:పైప్ నిండా నోట్ల కట్టలే.. అవాక్కైన అధికారులు, ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

అయితే వీరందరిలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యూసుఫ్‌ షరీఫ్‌ (కేజీఎఫ్‌ బాబు) (kgf babu) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే చదివిన ఆయన స్వయంకృషితో కుబేరుడిగా మారారు. యూసుఫ్‌ షరీఫ్‌ కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) కేంద్రంగా చాలాకాలం పాత సామాన్ల వ్యాపారం చేశారు. ఆ సమయంలో కేజీఎఫ్‌లో పాత ట్యాంకులు కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం చేసేవారు. అందుకే ఆయన పేరూ ‘కేజీఎఫ్‌ బాబు’గా స్థిరపడిపోయింది. అనంతరం తన మకాన్ని రాజధాని బెంగళూరుకు (bangalore) మార్చి.. వ్యాపారాన్ని విస్తరించారు. స్థిరాస్తి రంగంలోకి అడుగుపెట్టిన ఆయన .. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ (amitabh bachchan) నుంచి రూ.2.01 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ కారును కొన్నేళ్ల కిందట  కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు.   

click me!