జమ్మూ డ్రోన్ దాడి: దర్యాప్తు ఎన్ఐఏ చేతికి.. కాసేపట్లో మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

Siva Kodati |  
Published : Jun 29, 2021, 03:27 PM IST
జమ్మూ డ్రోన్ దాడి: దర్యాప్తు ఎన్ఐఏ చేతికి.. కాసేపట్లో మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

సారాంశం

కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్ దాడి ఘటనపై సమీక్షించున్నారు ప్రధాని. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతున్నారు. డ్రోన్ దాడులపై ఆయన ప్రధానికి వివరించనున్నారు.

కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్ దాడి ఘటనపై సమీక్షించున్నారు ప్రధాని. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతున్నారు. డ్రోన్ దాడులపై ఆయన ప్రధానికి వివరించనున్నారు. మూడు రోజులుగా కశ్మీర్ లోయలో పర్యటించిన రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రదాడిపై అధికారులతో సమీక్షించారు. తన పర్యటన వివరాలు, డ్రోన్ దాడిపై ప్రధానితో సమీక్షించనున్నారు రాజ్‌నాథ్ సింగ్. 

మరోవైపు జమ్మూ వైమానికి స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి ఘటన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై జాతీయ భద్రత దళం (ఎన్ఎస్‌జీ)కి చెందిన ప్రత్యేక స్క్వాడ్ బృందం విచారణ చేపట్టింది. ఆర్డీఎక్స్ లేదా టీఎన్‌టీ బాంబులను ఉపయోగించి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల నుంచే ఈ డ్రోన్‌లను నియంత్రించి వుంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ దాడిలో స్థానికుల హస్తం వుందా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. 

Also Read:జమ్మూ ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి: ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తిన భారత్

రెండు రోజుల క్రిందట రెండు డ్రోన్లు జమ్మూ వైమానిక స్థావరంలోకి ప్రవేశించాయి. ఒక భవనం పైభాగంతో పాటు పక్కనేవున్న ఖాళీ ప్రదేశంపై బాంబులను జరవిడిచాయి. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జమ్మూలోని మరో సైనిక స్థావరంపై దాడిని సైన్యం భగ్నం చేసింది. రత్నచక్, కాలుచక్ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 నిమిషాలకు ఒక డ్రోన్, అర్ధరాత్రి 2.40 నిమిషాలకు మరో డ్రోన్ ఆ ప్రాంతంలో సంచరించాయి. వీటి కదలికలను వెంటనే గుర్తించిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. దీంతో అవి చీకట్లో వేగంగా తప్పించుకున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?