నేడు పార్లమెంటరీ స్లాండింగ్ కమిటీ ముందుకు ఫేస్‌బుక్, గూగుల్ ప్రతినిధులు

By narsimha lodeFirst Published Jun 29, 2021, 12:19 PM IST
Highlights

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ఫేస్‌బుక్, గూగుల్ ప్రతినిధులు మంగళవారం నాడు హాజరుకానున్నారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సమన్లు పంపింది.


న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ఫేస్‌బుక్, గూగుల్ ప్రతినిధులు మంగళవారం నాడు హాజరుకానున్నారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ సమన్లు పంపింది.ఐటీ, టెక్నాలజీపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్త ఐటీ రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ రూల్స్  అమలు చేయాలని  సోషల్ మీడియా సంస్థలను కేంద్రం ఆదేశించింది. అయితే ఈ రూల్స్  అమలు చేయడంలో ట్విట్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్రం సీరియస్ అయింది.

also read:ఇండియా మ్యాప్ వివాదం: ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు

ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర్ హాజరైంది. ఇవాళ గూగుల్, ఫేస్‌బుక్ ప్రతినిధులు హాజరుకానున్నారు.పార్లమెంటరీ స్ఠాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులున్నారు.  21 మంది లోక్‌సభ నుండి, 10 మందిని రాజ్యసభ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

సోషల్ మీడియా సంస్థలు మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు ఆన్‌లైన్ న్యూస్ మీడియా ఫ్లాట్‌పారాలు దుర్వినియోగం కాకుండా నిరోధించే అంశంపై చర్చించనున్నారు.జూలై 6న జరిగే సమావేశంలో ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ప్రతినిధులు సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.

click me!