కేరళలో తొలి వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ.. వాటర్ మెట్రో జాతికి అంకితం..

Published : Apr 25, 2023, 01:56 PM ISTUpdated : Apr 25, 2023, 01:59 PM IST
కేరళలో తొలి వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ.. వాటర్ మెట్రో జాతికి అంకితం..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ కేరళ తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును మంగళవారం ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా ఊపారు.

ప్రధాని నరేంద్ర మోదీ కేరళ తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును మంగళవారం ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మోదీ పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎంపీ శశిథరూర్ తదితరులు పాల్గొన్నారు.ఈ రైలు తిరువనంతపురం నుంచి కాసరగోడ్‌ల మధ్య పరుగులు తీయనుంది. 

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మొత్తం కేరళలోని 11 జిల్లాలను కవర్ చేస్తుంది. ఆ జాబితాలో తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ కాసర్‌గోడ్ జిల్లాలు ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. దీని వలన సగటు ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు తగ్గుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది దేశీయంగా తయారు చేయబడిన సెమీ-హై-స్పీడ్ రైలు అన్న సంగతి తెలిసిందే. ఈ రైలు అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

ఇక, ప్రధాని మోదీ కేరళలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కొచ్చి వాటర్ మెట్రోను కూడా ప్రారంభించారు. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను కలుపుతూ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ సర్వీసులు నడపనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్ మెట్రో.

ఇదిలా ఉంటే, ప్రధాని మోదీ తిరువనంతపురంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య విధానానికి పెద్దపీట వేస్తోందన్నారు. కేరళ అభివృద్ధి చెందితే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu