ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం బీజేపీ జాతీయ నాయకులతో సమావేశం అయ్యారు. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం వారికి ప్రధాని మోడీ టార్గెట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓటు శాతాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని వివరించారు.
Parliament Elections: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సాధించాల్సిన లక్ష్యాన్ని స్పష్టంగా వారి చెప్పేశారు. వచ్చే ఏడాది అటూ ఇటుగా ఏప్రిల్ నెలలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి.
కాంగ్రెస్ కూడా ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నది. నాయకులకు కీలక బాధ్యతలను అప్పజెబుతున్నది. బీజేపీ కూడా లోక్ సభ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ జోష్ మీద ఉన్నది. పెద్ద రాష్ట్రమైన ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో బీజేపీ విజయపతాకాన్ని ఎగరేసింది. ఈ నేపథ్యంలోనే ఇదే దూకుడును పార్లమెంటు ఎన్నికల వరకూ కొనసాగించాలని జాతీయ నాయకత్వం పార్టీ నేతలకు సూచిస్తున్నది.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ నాయకులకు కీలక నిర్దేశం ఇచ్చారు. ఆయన శుక్రవారం బీజేపీ జాతీయ నాయకులతో సమావేశం అయ్యారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ 50 శాతం ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని సూచనలు చేశారు. అంతేకాదు, ఈ లోక్ సభ ఎన్నికలను ఒక మిషన్ గా భావించాలని, పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా ఒక టీమ్‌గా కలిసి పని చేయాలని పేర్కొన్నారు.
Also Read: Prashant Kishor: ఏపీలో ఎన్నికల రాజకీయం.. టీడీపీ, వైసీపీలను గురు శిష్యులు పంచుకున్నారా?
2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లను గెలుచుకుందని, ఈసారి ఈ సీట్లను మరింత పెంచుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. తమ భావాలను సోషల్ మీడియా వేదికగా బలంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు చేశారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ప్రజలకు బీజేపీ ప్రభుత్వ విధానాలను వివరించాలని తెలిపారు.