INDIA Bloc: సీఎం పదవి కోసం ఆ రెండు పార్టీలు విలీనం అవుతాయి: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

By Mahesh K  |  First Published Dec 23, 2023, 10:33 PM IST

ఇండియా కూటమిలో భాగస్వాములైన బిహార్‌కు చెందిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విలీనం అవుతాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. తేజస్వీ యాదవ్‌ను సీఎం చేసే క్రమంలో ఈ రెండు పార్టీలు విలీనం అవుతాయని లాలు ప్రసాద్ యాదవ్ తనకు చెప్పినట్టు సింగ్ తెలిపారు.
 


INDIA Bloc: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలోని రెండు పార్టీలు విలీనం అవుతాయని జోస్యం చెప్పారు. అవి కూడా ముఖ్యమంత్రి కుర్చీ కోసం జేడీయూ, ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయని అన్నారు. బిహార్ ముఖ్యమంత్రులుగా చేసిన లాలు ప్రసాద్ యాదవ్, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్‌లకు చెందిన పార్టీలు ఆర్జేడీ, జేడీయూలు విలీనం అవుతాయని గిరిరాజ్ సింగ్ తెలిపారు. లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్‌కు సీఎం పదవి ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటామని లాలు ప్రసాద్ యాదవ్ తనకు చెప్పాడని అన్నారు.

పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డ తర్వాత గిరిరాజ్ సింగ్ ఫ్లైట్‌లో బిహార్‌కు బయల్దేరాడు. అదే ఫ్లైట్‌లో లాలు ప్రసాద్ యాదవ్ కూడా ఎక్కారు. వారిద్దరూ పాట్నాకు వెళ్లారు. అయితే.. ఆ ప్రయాణంలో లాలు ప్రసాద్ యాదవ్ తనకు చాలా విషయాలు చెప్పాడని వివరించారు. తన వ్యక్తిగత అనుభవాలు కూడా పంచుకున్నాడని తెలిపారు.

Latest Videos

Also Read: Prashant Kishor: ఏపీలో ఎన్నికల రాజకీయం.. టీడీపీ, వైసీపీలను గురు శిష్యులు పంచుకున్నారా?

బిహార్ ఉప ముఖ్యమంత్రి, తన కొడుకు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన సమయం ఆసన్నమైందని లాలు ప్రసాద్ యాదవ్ తనకు చెప్పినట్టు గిరిరాజ్ సింగ్ అన్నారు. అందుకోసమే జేడీయూ, ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయని తనతో చెప్పినట్టు వివరంచారు. అయితే.. ఈ వ్యాఖ్యలను లాలు ప్రసాద్ యాదవ్ ఖండించారు. గిరిరాజ్ సింగ్‌కు నిత్యం మీడియాలో ఉండాలనే తాపత్రయం ఉంటుందని, కానీ, మీడియా ఆయనను గుర్తించదని చెప్పారు. అందుకోసమే ఇలాంటి ప్రేళాపనలు చేస్తారని అన్నారు.

click me!