PM Modi Europe Tour: "మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతకు చ‌ర‌మ గీతం": ప్ర‌ధాని మోడీ

Published : May 03, 2022, 03:32 AM IST
PM Modi Europe Tour: "మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతకు చ‌ర‌మ గీతం":   ప్ర‌ధాని మోడీ

సారాంశం

PM Modi Europe Tour: ఓటు వేయడం ద్వారా మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతను భారత్​ అంతం చేసింద‌ని,  30 ఏండ్ల‌ తర్వాత 2014లో పూర్తి మెజారిటీ గ‌ల‌ ప్రభుత్వం ఏర్పాటైంద‌ని, 2019లో భారత ప్రజలు ఆ ప్రభుత్వాన్ని మ‌రింత‌ బలోపేతం చేసారని ప్రధాని మోదీ అన్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్​లో ప్రవాస భారతీయులతో సమావేశమ‌య్యారు.    

PM Modi Europe Tour: ఒక బటన్‌ను నొక్కడం( ఓటు వేయ‌డం) ద్వారా గత మూడు దశాబ్దాలుగా నెల‌కొని ఉన్న‌ రాజకీయ అస్థిర వాతావరణానికి భారత్ ముగింపు ప‌లికింద‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెర్లిన్‌లోని పోట్స్‌డామర్ ప్లాట్జ్‌లో ప్రవాస భారతీయులతో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సంభాషిస్తూ.. ఈ వ్యాఖ్య‌లు చేశారు.  తాను జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఉన్నానంటే తన గురించి గానీ, మోదీ ప్రభుత్వం గురించి గానీ మాట్లాడానికి కాద‌ని ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. 

"కోట్లాది మంది భారతీయుల సామర్థ్యాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వారిని కీర్తించాలనుకుంటున్నాను, నేను కోట్లాది మంది భారతీయుల గురించి మాట్లాడేటప్పుడు, అందులో నివసించే వారితో పాటు ఇక్కడ నివసించే వారు కూడా ఉంటారు. ప్ర‌పంచ న‌లుమూల‌ల‌లో నివసిస్తున్న భ‌ర‌త మాత పిల్ల‌లంతా " రని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

భారత ప్రజలు గత మూడు దశాబ్దాలుగా ఒక బటన్ నొక్కడం ద్వారా రాజకీయంగా అస్థిర వాతావరణానికి చ‌ర‌మ గీతం పాడార‌ని అన్నారు. 30 ఏండ్ల‌ తర్వాత 2014లో పూర్తి మెజారిటీ గ‌ల‌ ప్రభుత్వం ఏర్పాటైంద‌ని అన్నారు. 2019లో భారత ప్రజలు ప్రభుత్వాన్ని బలోపేతం చేసారని ప్రధాని మోదీ అన్నారు. 

ఈ ఏడాది 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నామ‌ని. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన తొలి ప్రధాని తానేని తెలిపారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయంలో..భారతదేశం ప్ర‌పంచ దేశాల‌కు దిక్సూచిగా, అగ్ర స్థాయిలో ఉండాల‌నీ, ఆ దిశ‌గా భార‌త్ అడుగులేస్తుంద‌ని, ఆ లక్ష్యం వైపు వేగంగా ప్ర‌యాణిస్తోందని అన్నారాయన. సంస్కరణల ద్వారా తమ ప్రభుత్వం దేశాన్ని మారుస్తున్నదని ప్రధాని అన్నారు. సంస్కరణ కోసం, రాజకీయ సంకల్పం అవసరమ‌ని, నేడు భారతదేశం జీవన నాణ్యత, విద్య నాణ్యత, ఇతర అన్ని రంగాలలో ముందు ఉంద‌ని అన్నారు. మెరుగైన ఫలితాలను పొందుతున్నామని అన్నారు.

PREV
click me!

Recommended Stories

West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu