
Hardik Patel: హార్దిక్ పటేల్ గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పటేల్ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన గుజరాత్ కాంగ్రెస్ నేత. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ఆయన పార్టీ నుండి తప్పుకుంటారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం తన ట్విట్టర్, వాట్సాప్,టెలిగ్రామ్ బయో నుండి కాంగ్రెస్ పేరును తొలగించారు. అంతే కాకుండా.. హార్దిక్ పటేల్ కాషాయం ధరించిన ఓ ఫిక్ ను తన ప్రొఫైల్ ఫిక్ గా కూడా మార్చుకున్నాడు. హార్దిక్ తన ట్విట్టర్ బయోలో.. “గర్వించదగిన భారతీయ దేశభక్తుడు. సామాజిక, రాజకీయ కార్యకర్త. మెరుగైన భారతదేశం కోసం కట్టుబడి ఉన్నాను. అని రాసుకోచారు.
హార్దిక్ పటేల్ ( Hardik Patel) గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. బీజేపీని హార్దిక్ పటేల్ ప్రశంసించడంతో కాంగ్రెస్ అసౌకర్య స్థితిలో పడింది. అయితే, బిజెపిలో చేరడంపై ప్రశ్నించగా.. తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో హార్దిక్ పటేల్ అసంతృప్తి కాంగ్రెస్‌కు మంచిది కాదు. పటేల్ పలు సందర్భాల్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గుజరాత్‌లో పార్టీ పనితీరు పట్ల ఆయన సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో హార్దిక్ పటేల్ చేసిన పలు ప్రకటనలు చాలా చర్చనీయాంశమయ్యాయి. పార్టీలో నా స్థానం కొత్తగా పెళ్లయిన వరుడిలా ఉందని, పెళ్లయ్యాక స్టెరిలైజ్ చేయించుకున్నానని ఆయన అన్నారు. హార్దిక్ పటేల్ గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కానీ పిసిసి సమావేశానికి నన్ను ఆహ్వానించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారు నన్ను సంప్రదించరు, కాబట్టి ఈ పోస్ట్ యొక్క ప్రయోజనం ఏమిటి? అని పలు సార్లు తన ఆవేదన వ్యక్తం చేశారు.