PM Modi: భారత్-మారిషస్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. ప్రధాని మోడీతో రాంగూలాం చర్చలు

Published : Jun 24, 2025, 10:35 PM IST
Narendra Modi

సారాంశం

PM Modi: ప్రధాని మోడీతో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలాం ఫోన్‌లో సంభాషించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనే విషయాన్ని పునరుద్ఘాటించారని ప్రభుత్వ వర్గాలు తెలపాయి.

PM Modi: వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం దిశగా భారత్-మారిషస్ ఉమ్మడి ప్రణాళికలు విస్తరించే దిశగా ముందడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగూలాంతో ఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు భారత్-మారిషస్ మధ్య ఉన్న ప్రత్యేకమైన, అంతర్లీనమైన బంధాన్ని ప్రస్తావించారు.

ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వారు "ఎన్‌హాన్స్‌డ్ స్ట్రాటెజిక్ పార్ట్నర్‌షిప్" ను మరింత విస్తరించాలనే విషయాన్ని పునరుద్ఘాటించారు.

విస్తృత రంగాల్లో సహకారంపై భారత్ - మారిషస్ చర్చలు

మోడీ, రాంగూలాంలు తమ సంభాషణలో ఇరు దేశాల అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్య వృద్ధి, రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి విభిన్న రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం మీద చర్చించారు. ప్రధాని మోడీ, మారిషస్ ప్రధానమంత్రి రాంగూలాం 11వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా చేసిన సంపూర్ణ భాగస్వామ్యాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.

 

 

అంతకుముందు, మార్చి 11న జరిగిన ద్వైపాక్షిక మావేశంలో.. చరిత్ర, భాష, సంస్కృతి, వారసత్వం, బంధుత్వం, ఉమ్మడి విలువల పరంగా భారత్, మారిషస్ ల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదనీ, సాటిలేనిదని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల ప్రజల మధ్య గల బలమైన సాంస్కృతిక బంధాలే భారత్-మారిషస్ ల ప్రత్యేక అనుబంధానికి మూలమని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ అనుబంధం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందిందని, ఇది వివిధ రంగాలకు విస్తరించి రెండు దేశాలకు, ప్రజలకు, విస్తృత హిందూ మహాసముద్ర ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు.

విజన్ మహాసాగర్, పొరుగు ప్రాధాన్యతా విధానం పై మోడీ

ప్రధాని మోడీ మాట్లాడుతూ, మారిషస్ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా భారత్ తమ విజన్ మహాసాగర్, పొరుగు దేశాలకు ప్రాధాన్యత (Neighbourhood First) విధానాల పరిధిలో పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ.. డా. రాంగూలాంను భారత పర్యటనకు ఆహ్వానించారు. ఇద్దరు నాయకులు భవిష్యత్తులో కూడా అనుసంధానంగా ఉండాలని అంగీకరించారు.

మోడీ సూచనలతో యోగా ప్రారంభించిన మారిషస్ ప్రధాని

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మారిషస్ ప్రధాని నవీన్ రాంగూలాం మాట్లాడుతూ, “ పీఎం మోడీ నాకు యోగా చేయమని సూచించారు. ఆయనే ప్రత్యేకంగా ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. నాకు, నా భార్యను యోగా నేర్పించేందుకు మారిషస్‌కు పంపించారు. ఇందుకు నేను మోడీకి చాలా కృతజ్ఞుడిని” అని తెలిపారు. ఈ పరిణామం ద్వైపాక్షిక సంబంధాల్లో వ్యక్తిగత స్థాయిలోనూ ఉన్న సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !
Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu