Prophet Muhammad Row: "ప్రధాని భారతీయ‌ ముస్లింల మాట విన‌రు. కానీ.." ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Jun 08, 2022, 11:06 AM IST
Prophet Muhammad Row:  "ప్రధాని  భారతీయ‌ ముస్లింల మాట విన‌రు. కానీ.." ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

Prophet Muhammad Row:  మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత‌ల‌పై కేసు నమోదు చేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. శర్మ, జిందాల్ ల‌ను అరెస్ట్ చేయాలని కూడా ఒవైసీ అన్నారు. మరోవైపు.. ద్వేషపూరిత వాతావ‌ర‌ణాన్ని సృష్టించడంలో బీజేపీ కీల‌క‌ పాత్ర పోషించిందని ఒవైసీ ఆరోపించారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల‌ వ్యాఖ్యలను విమర్శిస్తూ గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలు నిరసనలు తెలిపాయి.   

Prophet Muhammad Row:  ప్రవక్త మహమ్మద్‌పై బ‌హిష్కృత బీజేపీ నేత‌లు చేసిన‌ అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయంగా మారాయి. ఈ వివాదాన్ని ప‌రిశీలిస్తే.. ఇప్పుడిప్పుడే త‌గ్గేలా లేదు. ఈ త‌రుణంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ  ముస్లిం దేశాల మాట వింటాడు కానీ,  దేశంలోని ముస్లింల మాటల‌ను ప‌ట్టించుకోద‌ని అన్నారు. ముస్లిం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లపై చర్యలు తీసుకున్నట్లు ఒవైసీ తెలిపారు. కానీ దేశంలోని ముస్లింలు తమ గళాన్ని పెంచుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమ‌ర్శించారు.

మహారాష్ట్రలోని లాతూర్‌లో మంగ‌ళ‌వారం జరిగిన ఓ ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. 'ఈ దేశంలో నివసించే ముస్లింలను ప్రధాని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బయటి దేశాలు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వెంటనే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నేత‌ల‌పై చర్య తీసుకున్నారని విమ‌ర్శించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత‌ల‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 

తప్పు చేశారని ప్రభుత్వం భావిస్తే.. వారిని అరెస్ట్ చేస్తే న్యాయం జరుగుతుందని.. నేను ప్రధాని అయితే.. న్యాయం జరుగుతుందని, వారిని అరెస్టు చేయించే వాడిన‌ని అన్నారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ 
పేర్లను ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. నేను మోడీకి వ్యతిరేకంగా అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే.. బిజెపి వారు ఒవైసీని అరెస్టు చేయమని డిమాండ్ చేసేవారు.కానీ మేము ఆ నేత‌ల‌ను అరెస్టు చేయాలని 10 రోజులుగా డిమాండ్ చేస్తున్నా.. త‌న‌ మాటను వినడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇంతకీ ప్రవక్త వివాదంలో ఏం జరిగింది?

ప్రవక్తకు వ్యతిరేకంగా నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యతిరేక అంశాలను క్రియాశీలకంగా మార్చాయి, అదే సమయంలో భారతదేశానికి దౌత్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తాయి. అల్ ఖైదా.. దేశంలోని అనేక పట్టణాలు, నగరాల్లో దాడులు చేస్తామని బెదిరించింది.

కువైట్ ఇప్పటికే తన స్టోర్ల నుంచి భారతీయ ఉత్పత్తులను ఉపసంహరించుకుంది. ఈ వ్యాఖ్యలపై కువైట్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఒమన్, ఇండోనేషియా సహా 15కి పైగా దేశాలు నిరసన తెలిపాయి. మరోవైపు, ముంబ్రా పోలీసులు నూపుర్ శర్మకు సమన్లు ​​జారీ చేసి జూన్ 22న హాజరు కావాలని కోరారు.

AIMPLB డిమాండ్

మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) కూడా కఠినంగా వ్యవహరించింది. ఈ మేరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు లేఖ విడుదల చేసింది. మహ్మద్ ప్రవక్తపై కించపరిచే, అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూపుర్ శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం