
పంజాబ్ : punjabలోని లూథియానా నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. onlineలో పరిచయమైన 21 యేళ్ల స్నేహితురాలిని తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడి బాగోతం లుధియానా నగరంలో వెలుగుచూసింది. సంగ్రూర్ లోని బెర్ కలాన్ గ్రామానికి అర్ష్‌దీప్ మాన్ అనే చెందిన నిందితుడు మల్టీమీడియా ఇన్ స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్ లో బాధితురాలితో స్నేహం చేశాడు. యువకుడు తన కుటుంబ సభ్యులను పరిచయం చేస్తాననే నెపంతో 20 ఏళ్ల తన ఆన్లైన్ స్నేహితురాలిని hotelకి తీసుకువెళ్లి molestation చేశాడని పోలీసులు తెలిపారు.
‘జూన్ 6వ తేదీన నిందితుడు నన్ను అతని సోదరి, బావమరిదికి పరిచయం చేయడానికి పఖోవాల్ రోడ్డులోని ఒక హోటల్ తీసుకువెళ్ళాడు. నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని అతను హెచ్చరించాడు’ అని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఫిర్యాదుదారుని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని, అందువల్ల ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలనుకుంటున్నట్లు నిందితుడు పేర్కొన్నాడని.. కేసు దర్యాప్తు చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రాజన్ దీప్ సింగ్ చెప్పాడు. నిందితుడిపై సదరు పోలీస్స్టేషన్లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి దారుణమే జరిగింది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి మానవ మృగంలా మారాడు. తల్లిలేని ఆ పసిపాప ఆలనాపాలనా చూడాల్సినవాడే ఆ బంగారు తల్లి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. వావి వరసలు మరిచి అభం, శుభం తెలియని ఆ 12 ఏళ్ల బాలికపై molestationకి పాల్పడ్డాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన uttarpradeshలోని కన్నౌజ్ లో గురుసహాయ్ గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి బాలిక తన అత్త వద్ద నిద్రపోతుండగా.. నిందితుడు ఆమెను బలవంతంగా వేరే గదిలోకి ఎత్తుకెళ్లాడు.
ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక ఏడుపులు విన్న ఆమె అత్త కేకలు వేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు గురు సహాయ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ సింగ్ తెలిపారు. పదేళ్ల క్రితమే బాలిక తల్లి చనిపోగా, అప్పటి నుంచి అదృశ్యమైన నిందితుడు నాలుగైదు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని Mahabubnagarలోని కోయిలకొండలో ఒక బాలికను లోబరుచుకుని ఇద్దరు యువకులు molestationకి పాల్పడడంతో గర్భవతి అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం లోని ఒక గ్రామానికి చెందిన 13 year old girlపై కొన్ని నెలల క్రితం కోయిలకొండ కు చెందిన గొల్ల రవి కుమార్, గడ్డం శ్రీకాంత్ సమీపంలోని పిండిగిర్నిలో అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తరువాత కూడా బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడికి దిగారు. వారం రోజుల క్రితం బాలిగా కడుపు నొప్పితో బాధపడుతూ తల్లికి విషయం చెప్పింది. కోయిలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భిణి అని తేలింది. దీంతో తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై శీనయ్య పోక్సో, ఎస్సీ, ఎస్టి, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.