ఫ్రాన్స్ కు బయలుదేరిన మోదీ.. రెండు రోజులపాటు పర్యటన..

Published : Jul 13, 2023, 07:08 AM ISTUpdated : Jul 13, 2023, 07:13 AM IST
ఫ్రాన్స్ కు బయలుదేరిన మోదీ.. రెండు రోజులపాటు పర్యటన..

సారాంశం

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ బయలుదేరారు. రెండు రోజుల ఈ పర్యటనలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. 

ఢిల్లీ : నేడు ప్రధాని మోడీ ప్రాన్స్ వెళ్లనున్నారు. ఈ ఉదయం కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. దాదాపు 4గం.లకు పారిస్ చేరుకుంటారు. ఓర్లీ విమానాశ్రయం దగ్గర ప్రధానికి స్వాగతం చెప్పనున్నారు. ప్రధాని నేడు,రేపు రెండు రోజులపాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.  

పారిస్ లో స్వాగతం అయ్యాక అక్కడినుంచి 7:30గంటలకు మోడీ ఫ్రాన్స్ సెనేట్‌కు చేరుకుంటారు. సెనేట్ అధ్యక్షుడు మిస్టర్ గెరాడ్ లార్చర్‌ను కలుస్తారు.

ఆ తరువాత రాత్రి 8:45గం.లకు, ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్‌తో సమావేశం కానున్నారు.

రాత్రి 11 గంటలకు ఐకానిక్ లా సీన్ మ్యూజికేల్‌లో భారత కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

ఆ తర్వాత, దాదాపు 00:30గం.ల సమయంలో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందించే ప్రైవేట్ డిన్నర్ కోసం మోడీ ఎలీసీ ప్యాలెస్‌కు చేరుకుంటారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం