Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆప్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ అభినంద‌న‌లు

Published : Mar 11, 2022, 01:33 AM IST
Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆప్ చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ అభినంద‌న‌లు

సారాంశం

Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చారిత్రాత్మక విజ‌యం న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో ఆప్ పార్టీని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని అభినందించారు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ఏకంగా.. 92 స్థానాలు గెలుపొంది.. తిరుగులేని పార్టీగా అవతరించింది. భారీ విజ‌యం కైవ‌సం చేసుకుంది. ఆప్ అల‌జ‌డి ముందు.. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కొట్టుక‌పోయింది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఓటమిని చవిచూశారు.

సీఎం చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ, కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎంలు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ వంటి హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. సీఎం చ‌న్నీ ప‌రిస్థితి మారి దారుణంగా మారింది. ఆయ‌న పోటీ చేసినా.. రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 92 సీట్లతో నాలుగింట మూడొంతుల మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీని అభినందించారు. పంజాబ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి అన్ని విధాలా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. 
 
ట్విటర్‌లో ప్రధాని మోదీ ఇలా రాసుకొచ్చారు.  "పంజాబ్ ఎన్నికలలో ఆప్ విజయం సాధించినందున ఆ పార్టీకి  అభినందనలు తెలియజేస్తున్నాను. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుండి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తానని హామీ ఇస్తున్నాను" అని అన్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్ గా భావించినా... ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ ..ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది.

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ సంగ్రూర్ జిల్లా ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58,206 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్‌కలన్‌లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆప్ ప్రకటించింది.

పంజాబ్ లో  AAP  తొలి విజయం,  2017 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోకా.. ఆ స‌మ‌యంలో ఆప్‌ రెండవ స్థానంలో నిలిచింది. క్ర‌మగా త‌న ప‌నితీరును మెరుగు ప‌రుచుకుంటూ మందుకు సాగారు. ఆ నిరీక్ష‌ణ నేడు ఫ‌లించింది. 117 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ 18 స్థానాలను కైవసం చేసుకోగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) మూడు స్థానాల్లో గెలుపొందగా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో 117 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ మూడు, స్వతంత్ర అభ్యర్థులు రెండు సీట్లు గెలుచుకున్నారు. మరోవైపు ఆప్ 20 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu