జీవితాంతం పేదల అభ్యున్నతికి అంకితమయ్యారు : ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పొవాతిల్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

By Mahesh RajamoniFirst Published Mar 23, 2023, 10:51 AM IST
Highlights

KOTTAYAM: తన జీవితాంతం పేదల అభ్యున్నతికి అంకితమయ్యారంటూ ఆర్చ్ బిషప్ మార్ జోసెఫ్ పొవాతిల్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. బిషప్ పొవాతిల్ 1994 నుండి 1998 వరకు కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), కేసీబీసీ మాజీ అధ్యక్షుడు. ఆయ‌న కంజిరపల్లి సిరో మలబార్ ఎపర్చరీ మొదటి బిషప్ కావ‌డం విశేషం.
 

Emeritus Archbishop Mar Joseph Powathil: ఈ నెల 18న కన్నుమూసిన ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మార్ జోసెఫ్ పొవాతిల్ అంత్యక్రియలు బుధవారం చంగనస్సేరిలోని సెయింట్ మేరీస్ మెట్రోపాలిటన్ చర్చి (వలియా పల్లి)లో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఆయ‌న 92 ఏళ్ల వ‌య‌స్సులో తుదిశ్వాస విడిచారు. బిషప్ పొవాతిల్ 1994 నుండి 1998 వరకు కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), కేసీబీసీ మాజీ అధ్యక్షుడు. ఆయ‌న కంజిరపల్లి సిరో మలబార్ ఎపర్చరీ మొదటి బిషప్ కావ‌డం విశేషం.

ప్ర‌ధాని మోడీ దిగ్భ్రాంతి.. 

బిషప్ పోవతిల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మార్ జోసెఫ్ పొవాతిల్ మరణవార్త విని చాలా బాధపడ్డానని తెలిపారు. "ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మార్ జోసెఫ్ పొవాతిల్ మ‌ర‌ణ వార్త ఎంత‌గానో బాధించింది. ఈ విషాద సమయంలో మీకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయ‌న తన జీవితాంతం సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితమయ్యారు. రైతుల సాధికారత కోసం పాటుపడి, ప్రజల సమ్మిళిత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారని" కొనియాడారు. ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మార్ జోసెఫ్ పొవాతిల్ తన ఆదర్శాలు, విలువలతో జీవించార‌నీ, ఇది సమాజానికి, దేశానికి నిస్వార్థంగా సేవలందించడానికి యువతరానికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 

పండితుడైన (scholar in theology) మార్ పొవాతిల్ సిరో-మలబార్ చర్చి ప్రార్థనా విధానం, తూర్పు సంప్రదాయాల పునరుద్ధరణకు సంబంధించిన విషయాలలో కఠినమైన వైఖరికి ప్రసిద్ది చెందాడ‌ని తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజీల ఫీజుల విషయంలో ఆయన కఠిన వైఖరి రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మార్గంలోకి తీసుకువ‌చ్చింద‌న్నారు. 1977లో కంజిరపల్లి బిషప్ గా పనిచేస్తూనే పీరుమేడు డెవలప్ మెంట్ సొసైటీ (పీడీఎస్), మలనాడు డెవలప్ మెంట్ సొసైటీ (ఎండీఎస్)లను స్థాపించాడు. కుట్టనాడు వికాస సమితి (కేవీఎస్)లో కూడా పనిచేశారు. చంగనాచెరి సోషల్ సర్వీస్ సొసైటీ (సి.హెచ్.ఎ.ఎస్.ఎస్) పోషకుడిగా అనేక అభివృద్ధి చెందిన ప్రాజెక్టులను నిర్వహించారు. వృత్తి విద్యాకోర్సుల్లో చేరిన నిరుపేద, అర్హులైన విద్యార్థుల కోసం, ఆర్చిడాక్స్ లోని దళిత క్రిస్టియన్ల కోసం అనేక స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ లను ఏర్పాటు చేశార‌ని కొనియాడారు.

కాగా, ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ మార్ జోసెఫ్ పొవాతిల్ 1972లో "యువదీప్తి (Yuvadeepti)" డయోసీసన్ యూత్ మూవ్ మెంట్ ను స్థాపించాడు. చివరకు అది కేరళ కాథలిక్ యూత్ మూవ్ మెంట్ (కేసీవైఎం)గా మారింది. కేసీబీసీ యూత్ కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. ఆర్చిబిషప్ లో, అతను సీనియర్ సిటిజన్స్ కోసం అపోస్టోలేట్, ఎమిగ్రెంట్స్ కోసం అపోస్టోలేట్, పర్యాటకుల కోసం అపోస్టోలేట్ ను స్థాపించాడు. రోమ్ లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న పోప్ జాన్ పాల్ II ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇండియన్ బ్రాంచ్ అయిన కానాకు ఆయన ఇన్ ఛార్జిగా ఉన్నారు.

click me!