Cabinet Meeting: సాయంత్రం కేంద్ర క్యాబినెట్ భేటీకి ప్రధాని మోడీ నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీకి పిలుపు ఇచ్చారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో క్యాబినెట్ సమావేశానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 

pm modi calls for union cabinet meet evening 6.30 pm kms

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్రమంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ రోజు సాయంత్రం కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్న సందర్భంలో ఆయన క్యాబినెట్ భేటీకి పిలుపు ఇవ్వడం గమనార్హం.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ముఖ్యమైన బిల్లులపై ఈ రోజు సాయంత్రం నాటి క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం పార్లమెంటు అనెక్సీ బిల్డింగ్‌లో జరగనున్నట్టు సమాచారం.

A meeting of the Union Cabinet is likely to take place at 6:30 p.m. today.

— ANI (@ANI)

Latest Videos

Also Read: ప్రజలు సంబరాలు చేసుకోలేదు.. పార్లమెంట్‌లో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన మోదీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలిరోజు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్రానికి ముందు ఈ సభ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు వేదికగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఇది పార్లమెంటు భవనంగా గుర్తింపు పొందింది. ఈ భవనాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని విదేశీ పాలకులు తీసుకున్నారనేది నిజం. అయితే మేము ఎన్నటికీ మరచిపోలేము. ఈ పార్లమెంట్ భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామని గర్వంగా చెప్పగలను’’ అని అన్నారు. 

vuukle one pixel image
click me!