Raju Srivastava Health Update:  జిమ్ చేస్తుండ‌గా గుండెపోటుకు గురైన‌ హ‌స్య న‌టుడు.. పరిస్థితి విష‌యం!

Published : Aug 11, 2022, 01:19 AM IST
 Raju Srivastava Health Update:  జిమ్ చేస్తుండ‌గా గుండెపోటుకు గురైన‌ హ‌స్య న‌టుడు.. పరిస్థితి విష‌యం!

సారాంశం

Raju Srivastava Health Update: ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. బుధ‌వారం ఉద‌యం జిమ్‌లో వ్యాయవం చేస్తుండగా ఆయనకు హార్ట్ ఎటాక్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కి ఆస్పత్రికి తరలించారు.   

Raju Srivastava Health Update: ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్‌ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కు హార్ట్ హాటాక్ రావ‌డంతో ఆయ‌న‌ను  ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. మీడియా కథనాల ప్రకారం.. రాజు శ్రీవాస్తవ దక్షిణ ఢిల్లీలో జిమ్ చేస్తూ ట్రేడ్ మిల్లుపై నుంచి స్పృహతప్పి పడిపోయాడు. దీంతో  అత‌ని స‌హాచ‌రులు వెంట‌నే ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐసీయూలో చిక్సిత పొందుతున్నారు. 

రాజు శ్రీవాస్తవ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, ప్రమాదం నుండి బయటపడ్డాడని రాజు పీఆర్‌ అజిత్‌ సక్సేనా తెలిపాడు. అతడిని కార్డియో విభాగానికి తరలించి.. కార్డియోక్యాత్ కోసం రెఫర్ చేశారు. ప్రస్తుతం రాజు శ్రీవాస్తవను అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిపారు.

 గత 4 నుంచి 5 రోజులుగా రాజు శ్రీవాస్తవ ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. హోటల్‌లో బస చేశాడు. హోటల్‌లోనే కాకుండా కల్ట్ జిమ్‌కు వర్కవుట్‌ల కోసం వెళ్లేవాడు. ఈరోజు కూడా ఆయ‌న వర్కవుట్ చేయ‌డం కోసం జిమ్ కి వెళ్లారు. వర్కవుట్ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావ‌డంతో పడిపోయాడు. జిమ్ ట్రైన‌ర్, జిమ్స్ సిబ్బంది వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. రాజు శ్రీవాస్తవ ఐసీయూలో చిక్సిత పొందుతున్నారు. 
 
AIIMS వర్గాల సమాచారం ప్రకారం.. న‌టుడు రాజు శ్రీవాస్తవ చికిత్స పొందుతున్నాడు. అతను బాగా స్పందిస్తున్నాడు, ప్రస్తుతం ఆయ‌న‌ పరిస్థితి నిలకడగా ఉంది. ఎయిమ్స్‌లోని సీనియర్‌ వైద్యుల బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు.
 
రాజు శ్రీవాస్తవ ప్రముఖ హ‌స్య నటుడే కాదు.. మిమిక్రీ కళాకారుడు కూడా. ఆయ‌న‌ అనేక భాషలలో సినిమాలు, టీవీ షోలలో పనిచేశాడు.  ఆయ‌న‌ మిమిక్రీ, కామెడీలో తన సహజ ప్రతిభకు ప్రసిద్ధి చెందాడు. రాజు శ్రీవాస్తవ PR అజిత్ సక్సేనా మీడియాతో మాట్లాడుతూ.. ఆయ‌న‌ కొంతమంది రాజకీయ నాయకులను కలవడానికి ఢిల్లీకి వచ్చారని చెప్పారు. జిమ్‌లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. రాజు పల్స్ రేటు వచ్చిందని, ఐసీయూలో ఉన్నారని సక్సేనా తెలిపారు. అతను త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు. 

మ‌రోవైపు .. త‌మ అభిమాన న‌టుడు రాజు శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు  పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఫిట్‌నెస్‌ కోసం సినీ నటీనటులు జిమ్‌లో గంటలు గంటలు కష్టడుతూ అతిగా కసరత్తులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?