లాక్‌డౌన్ 4కు సిద్ధంకండి.. మే 18కు ముందే వివరాలు చెబుతా: దేశ ప్రజలతో మోడీ

By Siva Kodati  |  First Published May 12, 2020, 8:40 PM IST

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న  కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు నాలుగో దశ లాక్‌డౌన్‌ అమలు చేయక తప్పదని, దీనికి భారత ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధాని తెలిపారు. మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తన నిర్ణయాలను తెలిపారు. 
 


దేశంలో అంతకంతకూ పెరుగుతున్న  కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు నాలుగో దశ లాక్‌డౌన్‌ అమలు చేయక తప్పదని, దీనికి భారత ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధాని తెలిపారు. మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తన నిర్ణయాలను తెలిపారు.

కరోనా కట్టడికి సంబంధించి రాష్ట్రాల సూచనలను పరిగణనలోనికి తీసుకుంటామని ప్రధాని చెప్పారు. మాస్కులు కట్టుకుందాం, రెండడుగుల దూరం పాటిద్దామని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ 4 పూర్తి స్థాయిలో భిన్నంగా ఉంటుందని.. ఇందుకు సంబంధించిన వివరాలను మే 18 కంటే ముందే ప్రజలకు తెలియజేస్తామని మోడీ తెలిపారు. 

Latest Videos

undefined

ఆర్ధిక వ్యవస్ధను పట్టాలెక్కించడానికి రూ. 20 లక్షల కోట్లతో ప్రధాని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు దీని ద్వారా ఊతం అందిస్తామన్నారు. దేశంలోని ప్రతి పారిశ్రామికుడిని కలుపుకుని పోయేలా ఈ ప్యాకేజ్ ఉంటుందని మోడీ చెప్పారు.

భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమానికి కూడా ఇది బలాన్ని చేకూరుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. ఆత్మ నిర్భర్ అభియాన్‌కు సంబంధించిన వివరాలను ఆర్ధిక మంత్రి వెల్లడిస్తారని మోడీ తెలిపారు. ఈ ఆర్ధిక ప్యాకేజ్ దేశ జీడీపీలో దాదాపు 10 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. 

click me!