అది అతని వ్యక్తిగత నిర్ణయం... శరద్ పవార్

By telugu teamFirst Published Nov 23, 2019, 10:15 AM IST
Highlights

మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన మలుపు తిరిగాయి. బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ డీప్యూటీ సిఎంగా ప్రమాణం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ వారి చేత ప్రమాణం చేయించారు.

మహారాష్ట్రలో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది.  రాత్రికి రాత్రే... మహారాష్ట్రలో రాజకీయం మొత్తం మారిపోయింది. కాగా... దీనిపై శరద్ పవార్ స్పందించారు. మహారాష్ట్రలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మద్దతు ఇవవ్డం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.  అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయం సరికాదని ఆయన అన్నారు.

అజిత్ పవార్ ని తాము సమర్థించడం లేదన్నారు. ఈ మేరకు ఆయన తాజా పరిణామాలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోనేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ..బీజేపీతో కలిసి నడవడం ఎన్సీపీ పార్టీ నిర్ణయం కాదన్నారు. దీనికి శరద్ పవార్ మద్దతు లేదని వెల్లడించారు.

Also Read రాత్రికి రాత్రే 'మహా' ట్విస్ట్: సిఎంగా ఫడ్నవీస్ ప్రమాణం, ఎన్సీపిలో చీలిక...

కాగా.... మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన మలుపు తిరిగాయి. బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ డీప్యూటీ సిఎంగా ప్రమాణం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ వారి చేత ప్రమాణం చేయించారు. 

అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు. కాంగ్రెసు, ఎన్సీపి, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైన స్థితిలో రాత్రికి రాత్రే అన్యూహ్యంగా ఆ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ ను, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మహారాష్ట్ర అభివృద్ధి వారు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

click me!