లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఆర్మీని దించాలంటూ సుప్రీంలో పిటిషన్

Published : Apr 20, 2020, 01:59 PM IST
లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఆర్మీని దించాలంటూ సుప్రీంలో పిటిషన్

సారాంశం

లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆర్మీని రంగంలోకి దింపేందుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త కె.ఆర్ షినాయి ఈ పిటిషన్ దాఖలు చేశాడు.

న్యూఢిల్లీ:లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో ఆర్మీని రంగంలోకి దింపేందుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త కె.ఆర్ షినాయి ఈ పిటిషన్ దాఖలు చేశాడు.

 దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉల్లంఘనలు చోటు చేసుకొంటున్నాయని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. పలు రాష్ట్రాల్లో ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరుగుతున్న విషయాన్ని కూడ ఆయన ప్రస్తావించారు. తప్పుడు వార్తల కారణంగా పెద్ద ఎత్తున జనం గుమికూడిన ఘటనలు కూడ చోటు చేసుకొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

లాక్ ‌డౌన్ నిబంధనలు ఉల్లంఘనకు గురికాకుండా ఉండేందుకు గాను పలు రాష్ట్రాల్లో ఆర్మీని రంగంలోకి దించాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు. ఈ నెల 14వ తేదీన ముంబైలో పెద్ద ఎత్తున వలస కూలీలు పెద్ద ఎత్తున బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద గుమికూడిన విషయాన్ని కూడ ఆయన పిటిషన్ లో ప్రస్తావించారు. 

also read:ఇండియాపై కరోనా పంజా: 24 గంటల్లో 1,553 కేసులు, మొత్తం 17,265కి చేరిక

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు పెళ్లి సమయంలో కూడ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని కూడ ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు. దేశంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘిస్తూ పలురాష్ట్రాల్లో జనం గుమికూడిన ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశంలో సోమవారం నాటికి 17,512  కరోనా కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?