కేరళ సీఎంగా రెండోసారి విజయన్ ప్రమాణం: 500 మందికి ఆహ్వానం

By narsimha lodeFirst Published May 20, 2021, 4:14 PM IST
Highlights

:కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినరయి విజయన్  గురువారం నాడు ప్రమాణం చేశారు. కేరళ రాష్ట్రానికి రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కేరళ రాష్ట్ర చరిత్రలో  వరుసగా ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో వరుసగా ఎల్డీఎఫ్ అధికారంలోకి రాలేదు. 
 

తిరువనంతపురం:కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినరయి విజయన్  గురువారం నాడు ప్రమాణం చేశారు. కేరళ రాష్ట్రానికి రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కేరళ రాష్ట్ర చరిత్రలో  వరుసగా ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో వరుసగా ఎల్డీఎఫ్ అధికారంలోకి రాలేదు. తిరువనంతపురంలోని స్టేడియంలో ఎంపిక చేసిన 500 మంది అతిథుల సమక్షంలో విజయన్ తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేశారు. విజయన్ సహా ఆయన మంత్రివర్గ సహచరులతో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. గత టర్మ్‌లో ఉన్న మంత్రులకు ఈ దఫా కేబినెట్ లో చోటు దక్కలేదు.  అంతేకాదు  సీనియర్ నేతలకు  పోటీ చేయడానికి కూడ ఈ దఫా  సీపీఎం అవకాశం కల్పించలేదు. 

also read:ప్రపంచం ప్రశంసించినా శైలజ టీచర్‌కు దక్కని చోటు: విజయన్ ఒక్కడే, సీపీఎం అనూహ్య నిర్ణయం

నిఫా వైరస్, కరోనాను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజకు ఈ దఫా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. శైలజను ప్రభుత్వ విప్ గా ఈ దఫా నియమించారు.  పార్టీలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించేందుకు గాను  కేబినెట్ లో యువతరానికి ప్రాధాన్యత ఇచ్చారు. గత టర్మ్ లో బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ స్థానం ఉండేది. ఈ ఎన్నికల్లో  బీజేపీ ఒక్క స్థానం కూడ నిలుపుకోలేకపోయింది.  మెట్రో మ్యాన్ గా  పేరొందిన శ్రీధరన్ ను బీజేపీ  బరిలోకి దింపినా ఆ పార్టీకి కలిసిరాలేదు. 
 

click me!