కరోనా బారిన పడిన పిల్లల డేటా సేకరించండి: జిల్లాల అధికారులతో మోడీ

By narsimha lodeFirst Published May 20, 2021, 3:35 PM IST
Highlights

కరోనా బారినపడిన పిల్లల వివరాలను సేకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అధికారులను కోరారు. 

న్యూఢిల్లీ:కరోనా బారినపడిన పిల్లల వివరాలను సేకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అధికారులను కోరారు. గురువారం నాడు  ఛత్తీస్‌ఘడ్, హర్యానా, ఒడిశా, రాజస్థాన్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమావేశమయ్యారు. వ్యాక్సిన్ డోసులను వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించాలని ఆయన కోరారు. కరోనా వ్యాప్తి చేయకుండా టీకా నిలుపుదల చేస్తున్నందున  వాటిని వేస్ట్ చేయవద్దన్నారు. వైరస్ మ్యుటేషన్ కారణంగా యువత, పిల్లల్లో  పెద్ద ఎత్తున ఆందోళన కల్గిస్తున్నాయని ఆయన చెప్పారు. పిల్లలు, యువతలో కరోనా కేసులకు సంబంధించిన డేటాను నిరంతరం సేకరించాలని ప్రధాని కోరారు. కరోనా  పిల్లలకు సోకడం ఆందోళన కల్గిస్తోందని ఆయన చెప్పారు.  ఈ వారంలో ఉత్తరాఖండ్ లో  వెయ్యి మంది పిల్లల్లో కరోనా సోకింది. 

also read:మీరు గెలిస్తే దేశం గెలిచినట్టే: జిల్లాస్థాయి అధికారులతో మోడీ

భారత్ బయోటెక్ కోవాగ్జిన్  వ్యాక్సిన్ ను 18 ఏళ్లలోపు పిల్లలపై  క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది.ఈ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.  అమెరికా, కెనడా దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ ను 18 ఏళ్లలోపు పిల్లలకు  ఇచ్చేందుకు  ఆమోదం తెలిపింది.వ్యాక్సిన్ ను వృధా చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో నేరమని ఢిల్లీ హైకోర్టు మంగళవారం అభిప్రాయపడింది.ఈ విషయాన్ని అధికారుల సమావేశంలో మోడీ  గుర్తు చేశారు. కరోనా వ్యాక్సిన్ డోసులను వృధా కాకుండా చూడాలని మోడీ కోరారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు. కరోనా అనేక సవాళ్లను తీసుకొచ్చిందన్నారు.  తమకు కొత్త వ్యూహాలు, పరిష్కారాలు అవసరమని చెప్పారు. స్థానిక అనుభవాలను ఉపయోగించాలని మోడీ సూచించారు. 


 

click me!