పొంగిపొర్లుతున్న పంబానది.. శబరిమల ఆలయ దర్శనానికి ఆటంకం

By ramya neerukondaFirst Published Aug 16, 2018, 11:04 AM IST
Highlights

అదేవిధంగా పక్క రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎవరూ దర్శనానికి రావద్దని కోరారు. ఇక్కడి పరిస్థితులు యధాస్థితికి వచ్చే వరకు భక్తులు, పర్యాటకు కేరళకు రావాలనే ఆలోచన మానుకోవాలని సూచించారు. 
 

కేరళలో కురిసిన భారీ వర్షాలకు పంబా నది ఉధృతంగా పొంగొపొర్లుతోంది. దీని కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.  రోజు రోజుకీ పంబా నదిలో నీటి మట్టం పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో.. ఆలయంలోకి భక్తులు వెళ్లడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కాగా.. ప్రతి సంవత్సరం శబరిమల ఆలయంలో ‘ నిరపుతార’ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ వరదల కారణంగా ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్ ని నిర్వహించరేమో అని అందరూ భావించారు.

అయితే.. అధికారులు ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు కలగకుండానే నిర్వహించారు. విచిత్రం ఏమిటంటే.. పూజారి కూడా లేకుండానే ఈ కార్యక్రమం పూర్తి చేయడం విశేషం. ఎప్పుడూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే పూజారి వరద కారణంగా ఆలయానికి చేరుకోలేకపోయారు. దీంతో మరో సీనియర్ పూజారి ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే.. ఆలయాన్ని మూసివేశారు. తిరిగి శుక్రవారం ఆలయాన్ని తెరుస్తారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రోజున కేరళ నూతన సంవత్సరం ఓనమ్ ప్రారంభం అవుతుంది కాబట్టి.. ఆ రోజు ఆలయాన్ని తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. 

ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే.. పంబా నది పొంగి పొర్లడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అదేవిధంగా పక్క రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎవరూ దర్శనానికి రావద్దని కోరారు. ఇక్కడి పరిస్థితులు యధాస్థితికి వచ్చే వరకు భక్తులు, పర్యాటకు కేరళకు రావాలనే ఆలోచన మానుకోవాలని సూచించారు. 
 

click me!