
మైసూర్ మహారాజు యదువీర్ కృష్ణదత్త బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. ఏకంగా రానున్న ఎన్నికల్లో ఆయనను పోటీకి దింపేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.యదువీర్ నిర్ణయం వెల్లడి కాకున్నా భాజపా మాత్రం ఆయన పార్టీలో చేరికపై సన్నాహకాలు ప్రారంభించింది.
త్వరలో కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్న ఆర్.ఎస్.ఎస్. సంచాలకుడు మోహన్ భాగవత్ సమక్షంలోనే యదువీర్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బెంగళూరులో నిర్వహించే ఆర్.ఎస్.ఎస్. సమావేశంలోనే యదువీర్ భాజపాలో చేరుతారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే నిజమైతే రానున్న ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త ఒడెయరును మైసూరు-కొడగు లోక్‌సభ క్షేత్రం నుంచి పోటీ చేసే అవకాశముంది. ఈయన పోటీ కచ్చితమైతే ఆ క్షేత్రం ఎంపీ ప్రతాప సింహ వేరొక క్షేత్రానికి బదిలీ అవుతారు.