
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ ఢిల్లీలోని తీహార్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆప్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపించింది. అయితే ఈ విమర్శలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్పందించారు. సత్యేందర్ జైన్‌కు అండగా నిలిచారు.
సత్యేందర్ జైన్ వెన్నెముకకు గాయాలు అయ్యాయని అన్నారు. దీంతో ఆయనను హాస్పిటల్ చేర్పిస్తే, డాక్టర్లు రెండు ఆపరేషన్లు చేశారని తెలిపారు. అయితే ఆపరేషన్ అనంతరం జైన్ ను రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించాడని అన్నారు. కోవిడ్ తర్వాత, ఆయన ఊపిరితిత్తులలో ఒక పాచ్ ఉందని అది ఇంకా నయం కాలేదని తెలిపారు. బీజేపీ రోగిని ఎగతాళి చేస్తోందని ఆరోపించారు.
మళ్లీ ర్యాగింగ్ భూతం.. మైనర్ బాలికను ఫ్రెషర్‌తో బలవంతంగా ముద్దు పెట్టించిన మూక.. వైరల్ వీడియో
సత్యేందర్ జైన్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ పై మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. బీజేపీకి అందమైన కథలు చెప్పి ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించాలని భావిస్తోందని అన్నారు. ‘‘ ఓ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు. మీరు అతడి వీడియో తీసి అతనిని ఎగతాళి చేస్తున్నారు. ’’ అని ఆరోపించారు. ‘‘ మీకు సిగ్గు లేదా ? మొదట జైన్‌ను తప్పుగా జైలులో పెట్టారు. అలాంటి పరిస్థితిలో అతడు గాయపడ్డాడు. ఇప్పుడు ఆయన చికిత్స ను కూడా ఎగతాళి చేస్తున్నారు. మీరు ఎంసీడీ, గుజరాత్ ఎన్నికల్లో గెలవరని అనుకుంటున్నారు. కాబట్టి సత్యేందర్ జైన్ వీడియోలను చూపించి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారు. ఒక వ్యక్తి అనారోగ్యాన్ని ఎగతాళి చేసి ఎన్నికల్లో గెలవడం కంటే దారుణం మరొకటి ఉండదు. ’’ అని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీపై ఎదురుదాడికి దిగారు. ‘‘ బీజేపీలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని ఆశించడం లేదు. మీ అధికారా, పదవిని దుర్వినియోగం చేసి మీరు ఒక వ్యక్తిని జైలులో పెట్టారు. అప్పుడప్పుడు కోర్టులు మారుస్తున్నారు. ఇంకొన్నిసార్లు న్యాయమూర్తులను మారుస్తున్నారు. ఇంకొన్నిసార్లు లాయర్లను మారుస్తున్నారు. మీ వ్యూహాలన్నీ విఫలమైనప్పుడు అతడి అనారోగ్య వీడియోను విడుదల చేసి ఎగతాళి చేస్తున్నారా ? ’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు, జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు గదిలో మసాజ్ చేయించుకుంటున్న సీసీటీవీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గత నెల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టుకు ఫుటేజీని అందించింది.
సెప్టెంబరు 13వ తేదీన ఓ వ్యక్తి జైలు గదిలో సత్యేందర్ జైన్ పాదాలకు, చేతులకు మసాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను గత నెల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు అందించింది. సత్యేందర్ జైన్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఆరోపించింది. అయితే ఈ వీడియోపై బీజేపీ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేసింది.
నియంత్రణ రేఖ వెంబడి పెరుగుతున్న చొరబాట్లు.. ఎన్ కౌంటర్లో పాకిస్తానీ ఉగ్రవాది హతం
‘‘ కత్తర్ బీమాన్ (నిజాయితీ లేని) దుండగుడు చట్టాలను ఉల్లంఘించి జైలులో మసాజ్ చేయించుకుంటున్నాడు. అతడు 5 నెలలు జైలులో ఉన్నాడు. కానీ ఆయనను ఇప్పటికీ మంత్రి పదవి నుండి తొలగించలేదు. ఈ వీడియో వీవీఐపీ సంస్కృతిని చూపిస్తోంది. మేము మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాం. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ దాక్కున్నాడు’’ అని బీజేపీ నేత గౌరవ్ భాటియా వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.