ఆయన యుద్దానికి సిద్దమైనా.. బరిలోకి మాత్రం రారు: రాహల్ గాంధీపై అస్సాం సీఎం వ్యంగ్యాస్త్రాలు

Published : Nov 19, 2022, 03:38 PM ISTUpdated : Nov 19, 2022, 03:40 PM IST
ఆయన యుద్దానికి సిద్దమైనా.. బరిలోకి  మాత్రం రారు:  రాహల్ గాంధీపై అస్సాం సీఎం వ్యంగ్యాస్త్రాలు

సారాంశం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ యుద్ధానికి సిద్ధమవుతూనే ఉంటారని, కానీ..  బరిలో మాత్రం దిగరని అన్నారు. ఆయనకు చాలా రోజులుగా ఆ అలవాటు ఉందని అన్నారు.   

భారత జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ ( రాహుల్ గాంధీ) యుద్దానికి సన్నద్ధమవుతూనే ఉన్నారు. కానీ, ఆయన ఎప్పుడు రంగంలోకి దిగరని అన్నారు. చాలా రోజులుగా రాహుల్ గాంధీని పరిశీలిస్తున్నననీ, గతంలో నుంచే ఆ అలవాటు ఉందని అన్నారు. గౌహతిలో క్రికెట్ మ్యాచ్ జరిగితే.. అతను గుజరాత్‌లో బ్యాట్, ప్యాడ్ కట్టుకుని సిద్దంగా ఉంటారని, కానీ, బరిలోకి రాదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. గుజరాత్‌లో బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అన్నారు. బీజేపీకి సవాల్‌ విసురుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు  రెండు, మూడు స్థానాల్లో నిలుస్తాయని అన్నారు. బిజెపికి పోటీ లేదనీ, ఆప్,కాంగ్రెస్ లు ఓటమి పాలవుతాయని పేర్కొన్నారు.  

రాహుల్ గాంధీకి చారిత్రాత్మక పరిజ్ఞానం చాలా తక్కువ అని పేర్కొంటూ..వీడీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రను ఆయన కోసం వేరొకరు చదివి ఉంటారని, ఆయన స్వయంగా చదివి ఉండరని విమర్శించారు. సావర్కర్‌ను అవమానించడం ద్వారా రాహుల్ గాంధీ ఘోర పాపం చేశారని, ఆయన ఆ పాపానికి  రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.

సావర్కర్ బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతీక అని రాహుల్ గాంధీ అనడంతో వివాదం ప్రారంభమైంది. అండమాన్‌లో రెండు మూడేళ్లు జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ పాలకులకు లేఖ రాశారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉన్న సేన వర్గం బిజెపి , ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన తీవ్రంగా మండిపడుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ