
Petrol-Diesel Price : ఇంధన ధరలు వానదారుల నడ్డివిరుస్తున్నాయి. ప్రస్తుతం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వానదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని పలు ప్రాంతాల్లో సెంచరీ కొట్టాయి. ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటగా.. శనివారం కూడా మరోసారి భారతీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. ఈ వారం ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 80 పైసలు పెంచాయి. ఈ విధంగా ఐదు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర రూ.3.20 పెరిగింది.
ఇండియన్ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) ఇంధన ధరల తాజా వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నాడు పెట్రోల్ ధర లీటరుకు రూ. 98.61కి చేరుకోగా, డీజిల్ లీటరుకు రూ. 89.87కి చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.112.51 నుండి రూ.113.35కి పెరిగింది. డీజిల్ ధర లీటరుకు రూ.96.70 నుంచి రూ.97.55కి పెరిగింది. ఢిల్లీతో పాటు మిగతా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ లీటరుకు రూ.100 మించి విక్రయిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోలు ధరలు అత్యధిక స్థాయికి చేరిన బాలాఘాట్‌లో పెట్రోల్ ధర రూ.113 దాటింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.113.03కి చేరుకుంది. డీజిల్ లీటరు ₹ 96.30కి విక్రయిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
| నగరం పేరు | పెట్రోల్ | డీజిల్ |
| ఢిల్లీ | 98.61 | 89.87 |
| ముంబై | 113.35 | 97.55 |
| కోల్‌కతా | 108.02 | 93.01 |
| చెన్నై | 104.43 | 94.47 |
| హైదరాబాద్ | 111.80 | 98.10 |
ఐదు రోజుల్లో నాలుగో సారి పెంపు..
5 రోజుల్లో 4 సార్లు పెరిగిన ధరలు వారం రోజుల్లో 4 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. మార్చి 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. దీని తర్వాత, మార్చి 23 న, పెట్రో డీజిల్ ధరలు వరుసగా 80-80 పైసలు పెరిగాయి. అదే సమయంలో, మార్చి 25, 26 తేదీల్లో కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 80 పైసలు పెంచాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో హెచ్చుతగ్గులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి, ముడి చమురు మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. మార్చి రెండో వారంలో ముడి చమురు బ్యారెల్‌కు 139 డాలర్లకు చేరుకుంది. అయితే మధ్యలో పతనం కావడంతో మళ్లీ 100 డాలర్ల దిగువకు చేరుకుంది. అదే సమయంలో, ఇప్పుడు మళ్లీ బ్రెంట్ క్రూడ్ ధరలో స్వల్ప జంప్ కనిపిస్తోంది.
చమురు ధరలు
ఇంధన ధరలు ప్రతిరోజూ నవీకరించబడతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రతిరోజూ మార్పులకు గురవుతుంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను సమీక్షించిన తర్వాత ప్రతి రోజు ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్ మరియు డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.