రెండు నెలల తర్వాత మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్

First Published Aug 7, 2018, 6:01 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కఠిన చర్యల కారణంగా దాదాపు రెండు నెలల పాటు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితుల కారణంగా దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

దేశరాజధాని ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం పెట్రోల్‌ 9 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.77.06కి చేరుకోగా... డీజిల్‌పై 6 పైసలు పెరిగి లీటర్ ధర రూ.68.50గా నమోదైంది. చివరిగా ఈ ఏడాది మే 29న పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.78.43.. డీజిల్ ధర రూ.69.30కి చేరింది.

click me!