విషమించిన కరుణానిధి ఆరోగ్యం: కన్నీళ్లతో కావేరీ ఆసుపత్రికి కనిమొళి

First Published Aug 7, 2018, 5:54 PM IST
Highlights

డీఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కావేరీ ఆసుపత్రికి చేరుకొంటున్నారు. కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి  కన్నీళ్లు పెట్టుకొంటూ కావేరీ ఆసుపత్రికి మంగళవారం నాడు చేరుకొన్నారు.
 

డీఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కావేరీ ఆసుపత్రికి చేరుకొంటున్నారు. కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి  కన్నీళ్లు పెట్టుకొంటూ కావేరీ ఆసుపత్రికి మంగళవారం నాడు చేరుకొన్నారు.


కరుణానిధి ఆరోగ్యం విషమించిందని ప్రకటించిన నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు కావేరీ ఆసుపత్రి వద్దకు ఒక్కొక్కరుగా చేరుకొంటున్నారు. అయితే ఆసుపత్రికి వద్దకు కనిమొళి కన్నీళ్లు పెట్టుకొంటూ వచ్చారు.

కనిమొళిని చూసిన డీఎంకె కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు, డీఎంకె సానుభూతిపరులు ఒక్కసారిగా ఉద్నిగ్నానికి లోనయ్యారు. కరుణానిధి ఆరోగ్యం మరింత విషమంగా ఉందని కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం నాడు సాయంత్రం ప్రకటించారు. దీంతో  కరుణానిధి విషయమై  ఎప్పుడు ఏ రకమైన వార్త వినాల్సి వస్తోందోననే ఆందోళన  ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

దీంతో కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి వద్దకు భారీగా డీఎంకె కార్యకర్తలు చేరుకొంటున్నారు.  అంతేకాదు  ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం కరుణానిధి ఆరోగ్యం విషమించిందని కావేరీ వైద్యులు ప్రకటించారు. అయితే  24 గంటల తర్వాత కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

కరుణానిధి అవయవాలు వైద్యానికి సహకరించడం లేదని వైద్యులు ప్రకటించారు. దీంతో డీఎంకె కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.  ఆసుపత్రి వద్దకు భారీగా డీఎంకె కార్యకర్తలు చేరుకొంటున్నారు. 
 


 

click me!