కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. కోర్టు ఏం చెప్పిందంటే ?

By Sairam Indur  |  First Published Mar 28, 2024, 2:19 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ను సీఎం పదవిలో నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.


ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు.. ఈ అంశంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునే అవకాశం లేదని తెలిపింది. ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త, రైతు సుర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్ఐఏ కొత్త డీజీగా సదానంద్ వసంత్ డాటే.. ఆయన నేపథ్యం ఇదే..

Latest Videos

ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రిని ప్రభుత్వ పదవిలో కొనసాగనివ్వరాదని యాదవ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఈ పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించడమే కాకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తుందని ఆయన చెప్పారు. ఎందుకంటే కేజ్రీవాల్ జైలులో ఉండటం వల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, 164లను సంతృప్తిపరచలేరని పిల్ లో యాదవ్ పేర్కొన్నారు.

మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

అరెస్టుతో సీఎం ఒకరకంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారని, ఆయన కూడా కస్టడీలో ఉన్నందున ప్రభుత్వ విధులు, బాధ్యతలు నిర్వర్తించలేరని నిరూపించుకున్నారని, ఇప్పుడు ఆయనను సీఎం పదవిలో కొనసాగించవద్దని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. ఈ పిటిషన్ ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఇది ఎగ్జిక్యూటివ్‌కు సంబంధించిన అంశమని పేర్కొంది. 

ఎలక్టోరల్ బాండ్ ఇష్యూ ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ - నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్

ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తరువాత కోర్టు ఆయనకు మార్చి 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఆ గడువు నేటితో ముగిసింది. దీంతో కేజ్రీవాల్ ను ఈడీ నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. రిమాండ్ ను మరి కొన్ని రోజులు పొడిగించాలని ఈడీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. 

click me!