అల్లోపతిపై వ్యాఖ్యలు: బాబా రాందేవ్‌పై దేశద్రోహం కేసు పెట్టండి.. కోర్టుకెక్కిన బీహార్ వాసి

By Siva KodatiFirst Published Jun 3, 2021, 3:34 PM IST
Highlights

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లోపడ్డ ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కారాలుమిరియాలు నూరుతోంది

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లోపడ్డ ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కారాలుమిరియాలు నూరుతోంది. తాజాగా, బీహార్ కు చెందిన జ్ఞాన్ ప్రకాశ్ అనే వ్యక్తి బాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ముజఫర్‌పూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. బాబా రాందేవ్ అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని జ్ఞాన్ ప్రకాశ్ పిటిషన్‌లొ ఆరోపించారు. రాందేవ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

కాగా,  ఆలోపతి వైద్యానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రామ్ దేవ్ బాబా వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ట్విటర్ వేదికగా ఆయన ఆ విషయం తెలిపారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలోపతి వైద్యులను అవమానించే విధంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఎ) విరుచుకుపడింది. దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 

Also Read:నన్ను అరెస్ట్ చేయడం వాళ్ల తండ్రి వల్ల కూడా కాదు.. రాందేవ్ బాబా మరో వివాదం...

అలోపతి వైద్యులపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను మంత్రి హర్షవర్ధన్ ఖండించారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచిస్తూ ఆయన రామ్ దేవ్ బాబాకు ఓ లేఖ రాశారు. దాంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు. హర్షవర్ధన్ ను ఉద్దేశిస్తూ తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు. 

"మీ లేఖ నాకు అందింది. వైద్య విధానాలపై నేను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తన్నారు నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను" అని రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు. ఆధునిక వైద్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు.  హర్షవర్ధన్ కు ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేసిన 8 నిమిషాల తర్వాత రామ్ దేవ్ బాబు మరో ట్వీట్ చేశారు. యోగా, ఆయుర్వేదం పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని, ఆధునిక వైద్య శాస్త్రానికి పరిమితులు ఉన్నాయని ఆయన అన్నారు. 

click me!