ప్రియురాలి కోసం వధువులా మారిన ప్రియుడు..!

Published : Jun 03, 2021, 03:01 PM IST
ప్రియురాలి కోసం వధువులా మారిన ప్రియుడు..!

సారాంశం

వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసి.. ఆమెను ఇంట్లో బంధించారు.  వేరే వ్యక్తితో పెళ్లి కూడా నిశ్చయించారు.  అయితే.. తన ప్రేయసిని చూడటానికి సదరు యువకుడు అచ్చం అమ్మాయిలాగా రెడీ అయ్యాడు.

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. అనుకోకుండా వారి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో.. యువతిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేశారు. ఈ అబ్బాయికేమో.. ప్రేయసిని చూడకుండా ఉండలేకపోయాడు. దీంతో ఇంకేముంది.. అమ్మాయిలాగా మారి వెళ్లి కలవాలని అనుకున్నాడు. కానీ అందులో ఓ చిన్నపొరపాటు  చేసి యువతి కుటుంబసభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌహీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసి.. ఆమెను ఇంట్లో బంధించారు.  వేరే వ్యక్తితో పెళ్లి కూడా నిశ్చయించారు.  అయితే.. తన ప్రేయసిని చూడటానికి సదరు యువకుడు అచ్చం అమ్మాయిలాగా రెడీ అయ్యాడు.

అయితే.. అది కూడా పెళ్లికూతురులా రెడీ అయ్యాడు. మామూలుగా అమ్మాయిలా రెడీ అయ్యి ఉంటే వారికి అనుమానం వచ్చేది కాదేమో. వధువు లా రావడంతో అనుమానం వచ్చి.. ముఖం మీది ముసుగు తీశారు. చున్నీ తీసి చూడగా ఆ యువకుడు కనిపించాడు. యువతి కుటుంబసభ్యులు పట్టుకుందామని ప్రయత్నించగా..  ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

కాగా.. దీనికి  సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని  చూసి నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu