ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ను ఏకిపారేసిన భారత్.. ఇది దాని దారుణమైన రికార్డ్ అంటూ...

By SumaBala BukkaFirst Published Jan 26, 2022, 1:50 PM IST
Highlights

సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో దాయాది దేశంపై భారత్ విరుచుకుపడింది. ‘ప్రస్తుతం మనం పౌరుల రక్షణపై చర్చిస్తున్నాం. ఇప్పుడు వారికి ఉగ్రవాదుల నుంచి ముప్పు వస్తుంది. 2008లో ముంబైలో జరిగిన అత్యంత దారుణమైన  ఉగ్రదాడికి సంబంధించిన నిందితులకు వారి దేశం మద్దతు లభిస్తూనే ఉంది’  అని వ్యాఖ్యలు చేసింది.

.

ఢిల్లీ : 2008లో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడి నిందితులకు Pakistan మద్దతు ఇంకా అందుతూనే ఉందని United Nations Security Council (యూఎన్ఎస్ పీ)లో bharat ఆగ్రహం వ్యక్తం చేసింది. అది చాలక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ..  ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది.

సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ అనే అంశంపై జరిగిన చర్చలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో దాయాది దేశంపై భారత్ విరుచుకుపడింది. ‘ప్రస్తుతం మనం పౌరుల రక్షణపై చర్చిస్తున్నాం. ఇప్పుడు వారికి Terroristల నుంచి ముప్పు వస్తుంది. 2008లో ముంబైలో జరిగిన అత్యంత దారుణమైన  ఉగ్రదాడికి సంబంధించిన నిందితులకు వారి దేశం మద్దతు లభిస్తూనే ఉంది’  అని వ్యాఖ్యలు చేసింది.

‘ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం, మద్దతు  ఇవ్వడంలో పాకిస్తాన్ చరిత్ర, దాని విధానం సభ్యదేశాలకు తెలుసు. సాయుధ మూకలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఆయుధాలు అందించే దేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు అతిథ్యం ఇస్తున్న దేశంగా దారుణమైన రికార్డును సొంతం చేసుకుంది. అది ఎంతగా ఉందంటే… ప్రపంచవ్యాప్తంగా  చాలా ఉగ్రదాడులు  ఏదో ఒక రూపంలో  పాకిస్తాన్  మూలాల్ని కలిగి ఉన్నాయి’ అంటూ తీవ్రంగా స్పందించారు.

అలాగే Jammu and Kashmir అంశంపై మాట్లాడుతూ… జమ్మూ కాశ్మీర్, లద్ధాఖ్  ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది.  అలాగే పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలు కూడా తనలో భాగమేనని,  వాటిని వెంటనే ఖాళీ చేయాలని తేల్చి చెప్పింది. తాము పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు కోరుకుంటామని ఈ సందర్భంగా భారత్ తన వైఖరిని వెల్లడించింది. గతంలో జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా  రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కట్టుబడి  ఉన్నాం  అంది. 

ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో కూడా పాక్ కు ఐక్యరాజ్యసమితి వేదికగా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక అత్యున్నత చర్చలో ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ సమస్యను ప్రస్తావిస్తూ ప్రసంగించిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ను తక్షణమే ఖాళీ చేయాలని పిలుపునిచ్చింది. 

కాశ్మీర్‌పై ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనలకు యూఎన్ లో ఇండియా ఫస్ట్ సెక్రటరీ  స్నేహా దుబే ఘాటుగా ప్రతిస్పందించారు. 'ప్రత్యుత్తరం ఇచ్చే హక్కు'లో, భాగంగా ఆమె ఈ రిప్లై ఇచ్చారు. దీంట్లో భాగంగా స్నేహా దుబే పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు మద్దతునిస్తుందనే విషయం దృవీకరించబడిన చరిత్ర అంటూ మండిపడ్డారు. 

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగానికి ముందు ఇది జరిగింది. అంతేకాదు భారతదేశానికి వ్యతిరేకంగా 'తప్పుడు, హానికరమైన' ప్రచారం చేయడానికి పాకిస్తాన్ పలుమార్లు ప్రయత్నిస్తుందని... యూఎన్ అందించిన వేదికలను ఇలా 'దుర్వినియోగం' చేయడం పాకిస్తాన్ నాయకుడికి ఇదేం మొదటిసారి కాదని ఆమె అన్నారు.

‘దురదృష్టవశాత్తూ, పాకిస్తాన్ నాయకుడు మా దేశంపై తప్పుడు, హానికరమైన ప్రచారం చేయడానికి ఐక్యరాజ్యసమితి వేదికలను దుర్వినియోగం చేయడం ఇదే మొదటిసారేం కాదు. ఉగ్రవాదులకు వారి దేశంలో ఫ్రీ పాస్ ఉంది. యదేచ్ఛగా తిరుగుతున్నారు. సామాన్య ప్రజల జీవితాల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అయినా తమ దేశంలోని ఈ విషాదకరమైన స్థితిని ప్రపంచం దృష్టిలో పడకుండా ఉండడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారి జీవితాలు చాలా ఘోరంగా తయారయ్యాయి"అని దుబే చెప్పారు.

click me!