పెగాసెస్‌పై దర్యాప్తునకు సుప్రీం ఓకే: వచ్చే వారంలో విచారణ

By narsimha lodeFirst Published Jul 30, 2021, 11:23 AM IST
Highlights

పెగాసెస్ అంశంపై విచారణకు  సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయమై వచ్చే వారంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

న్యూఢిల్లీ: పెగాసెస్  అంశంపై విచారణ కు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయమై స్వతంత్ర దర్యాప్తు చేయాలని జర్నలిస్టులు ఎన్. రామ్, శశికుమార్ లు  దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేశారు.దేశంలోని విపక్షనేతలు, కేంద్ర మంత్రులతో పాటు ప్రముఖ జర్నలిస్టులకు చెందిన ఫోన్లను పెగాసెస్ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. 

 

పెగాసెస్ అంశంపై విచారణ కు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయమై స్వతంత్ర దర్యాప్తు చేయాలని జర్నలిస్టులు ఎన్. రామ్, శశికుమార్ లు దాఖలు చేసిన పిటిషన్లు దాఖలు చేశారు.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఈ విషయమై ఆగష్టు మొదటి వారంలో విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. మంగళ, బుధవారాలు మినహా మిగిలిన రోజుల్లో  విచారణకు  షెడ్యూల్ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.ఈ విషయమై స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారు. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సమయం నుండి ఈ అంశంపై ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.. పార్లమెంట్ ఉభయ సభలను స్థంబింప చేస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇదే అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉభయ సభలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.
 

click me!