తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని.. తోడబుట్టిన చెల్లినే నరికి చంపారు... !

Published : Jul 30, 2021, 10:56 AM IST
తమకిష్టంలేని పెళ్లి చేసుకుందని.. తోడబుట్టిన చెల్లినే నరికి చంపారు... !

సారాంశం

ఈ పెళ్లి అర్చన కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు దేవేంద్ర, అతడి ముగ్గురు తమ్ముళ్లపై తాతాగంజ్ పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టారు. 

లక్నో : తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందనే కోపంతో చెల్లెల్ని హత్య చేశారు అన్నలు. పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్, పులియ గుజర్ కు చెందిన అర్చన గత నెల 28న ఇంటినుంచి పారిపోయి మామ వరుసయ్యే దేవేంద్ర అనే వ్యక్తిన పెళ్లి చేసుకుంది. 

ఈ పెళ్లి అర్చన కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబసభ్యులు దేవేంద్ర, అతడి ముగ్గురు తమ్ముళ్లపై తాతాగంజ్ పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు పెట్టారు. 

దీంతో దేవేంద్ర, భార్య అర్చన, తమ్ముడిని వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్ కు బయలు దేరాడు. విషయం తెలుసుకున్న ఆమె ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు పోలీస్ స్టేషన్ సమీపంలో కాపు కాశారు. 

పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ముగ్గురిపై దాడి చేశారు. ఈ దాడిలో అర్చన చనిపోయింది. దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అర్చన ఇద్దరు తమ్ముళ్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్