రాహుల్‌ నేతృత్వంలో విపక్షాల బ్రేక్‌ఫాస్ట్ భేటీ: 14 పార్టీల ఎంపీల హాజరు, ఆ రెండు పార్టీలు దూరం

By narsimha lodeFirst Published Aug 3, 2021, 10:53 AM IST
Highlights

 పెగాసెస్ సహా ఇతర కీలక అంశాలపై చర్చించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాల ఎంపీలు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో మంగళవారంనాడు భేటీ అయ్యారు.ఈ భేటీలో 14 పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఆప్,  బీఎస్పీ ప్రతినిధులు దూరంగా ఉన్నారు.

న్యూఢిల్లీ: పెగాసెస్‌ సహా ఇతర కీలకాంశాలపై అనుసరించాల్సిన వ్యూహాంపై విపక్షాలు న్యూఢిల్లీలో మంగళవారం నాడు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి 14 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఆప్, బీఎస్పీ మాత్రం దూరంగా ఉన్నాయి.

ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో విపక్ష ఎంపీలతో రాహుల్ గాంధీ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్రం తీరుపై  విపక్షాలు ఉమ్మడిగా  పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణను సిద్దం చేశారు.జూలై 19వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన  రోజు నుండి పెగాసెస్ అంశంపై ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగుతున్నాయి. దీంతో  పార్లమెంట్ ఉభయసభల్లో కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.రాహుల్ గాంధీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎన్సీపీ, టీఎంసీ, శివసేన, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ,సీపీఐ, సీపీఎం, ఐయుఎంఎల్, ఆర్‌ఎస్పీ, జేఎంఎం, కేసీఎం, డీఎంకె లకు చెందిన 100 మంది ఎంపీలు హాజరయ్యారు.

click me!