మేనమామ ఆస్తిపై కన్నేసి.. కిరాతకంగా చంపేసి..!

Published : Aug 03, 2021, 10:32 AM ISTUpdated : Aug 03, 2021, 12:36 PM IST
మేనమామ ఆస్తిపై కన్నేసి.. కిరాతకంగా చంపేసి..!

సారాంశం

ప్రసన్న వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దామని చెప్పి అత్తమామలను కారులో తీసుకొచ్చాడు. దర్శనానంతరం తిరుత్తణికి తిరుగు ప్రయాణంకాగా.. కారులోనే సంజీవరెడ్డి, మాలతిని మెడకు తాడు బిగించి చంపేశాడు.

వ్యాపారాలను చూసుకుంటాడని మేనల్లుడి తెచ్చి దగ్గరపెట్టుకున్నారు. అయితే.. ఆ మేనల్లుడు వ్యాపారం చూసుకోవడం పక్కనపెట్టి.. మేనమామ ఆస్తిపై కన్నేశాడు. పథకం ప్రకారం.. మేనమామ, అతని భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాలను చిత్తూరులోని ఓ అటవీ ప్రాంతంలో పడేశాడు.ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని తిరుత్తణికి చెందిన సంజీవరెడ్డి(70) ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవారు. ఈయన కుమారుడు దూరప్రాంతంలో ఉంటున్నారు. దీంతో ఇతడి చెల్లెలి కుమారుడు రంజిత్‌ కుమార్‌ ఫైనాన్స్‌ వాప్యారాన్ని చూసుకుంటూ.. అన్ని విషయాల్లోనూ మామకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. 

ఈ క్రమంలో మామ ఆస్తిని కాజేయాలని కుట్రపన్నాడు. గతనెల 29వ తేదీన వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దామని చెప్పి అత్తమామలను కారులో తీసుకొచ్చాడు. దర్శనానంతరం తిరుత్తణికి తిరుగు ప్రయాణంకాగా.. కారులోనే సంజీవరెడ్డి, మాలతిని మెడకు తాడు బిగించి చంపేశాడు.

 అదే రోజు రాత్రి రామచంద్రాపురం మండలం పచ్చికాపల్లం ప్రధాన రహదారి చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో మృతదేహాలను పడేసి వెళ్లిపోయాడు. తన తల్లిదండ్రులు కనబడకపోవడంతో కుమారుడు తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రంజిత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించడంతో తానే హతమార్చినట్లు అంగీకరించాడు. 

దీంతో తిరుత్తణి పోలీసులు నిందితుడిని తీసుకొని ఆదివారం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో మృతదేహాలను పడేసిన ప్రదేశానికి తీసుకొచ్చారు. సోమవారం తిరుత్తణి, ఆర్సీపురం పోలీసులు సంజీవరెడ్డి బంధువుల సమక్షంలో శవపంచనామాలు నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్