తగ్గిన కరోనా కేసులు: ఇండియాలో మొత్తం కేసులు 3,17,26,507కి చేరిక

By narsimha lodeFirst Published Aug 3, 2021, 10:36 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు తగ్గాయి. నిన్న ఒక్క రోజు 30,549 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే కరోనాతో 422 మంది మరణించారు.

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. కానీ నిన్న ఒక్క రోజు మాత్రమే 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.ఇండియాలో మొత్తం కేసులు 3,17,26,507కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులో 422 మంది మరణించారు. దేశంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 4.25 లక్షలకు చేరుకొంది.

నిన్న ఒక్క రోజున 30,549 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3.17 కోట్లకు చేరాయి. కేరళ, మహారాష్ట్రలో  కరోనా కేసులు తక్కువగా నమోదు కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య తగ్గిపోయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 4,04,958కి చేరుకొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.28 శాతంగా ఉందని ఐసీఎంఆర్ తెలిపింది.

గత 24 గంటల్లో కరోనా నుండి 38,887 మంది కోలుకొన్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3.08 కోట్లకు చేరుకొంది. కరోనా రికవరీ రటే 97.38 శాతంగా ఉంది.నిన్న ఒక్క రోజునే 16,49,295 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 47,12,94,789 మందికి కరోనా పరీక్షలను నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.


 

click me!