శాంతించిన నుహ్.. రెండు వారాల తరువాత ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ..

Published : Aug 14, 2023, 02:38 PM IST
శాంతించిన నుహ్.. రెండు వారాల తరువాత ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ..

సారాంశం

మత ఘర్షణలు చెలరేగిన హర్యానాలోని నుహ్ లో పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రస్తుతం ఆ జిల్లాతో పరిసర ప్రాంతాల్లోనూ శాంతి నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ పోలీసు అధికారులు పునరుద్దరించారు. స్కూల్స్ కూడా యథావిథిగా కొనసాగుతున్నాయి.

హర్యానాలోని నుహ్ జిల్లాలో శాంతి నెలకొంది. ఈ జిల్లాలో మతఘర్షణల నేపథ్యంలో నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ సర్వీసును పునరుద్ధరించినట్లు పోలీసులు తెలిపారు. జులై 31వ తేదీన జరిగిన హింసాకాండ నేపథ్యంలో ఆగస్టు 8 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఆ తర్వాత సస్పెన్షన్ ను ఆగస్టు 13 వరకు పొడిగించారు.

అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి.. ఏడాదిలో రెండో సారి ఘటన

గురుగ్రామ్ లోజూలై 31న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఊరేగింపుపై అల్లరి మూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జిల్లాకు ఆనుకొని ఉన్న ఇతర జిల్లాలకు మత ఘర్షణలు వ్యాపించాయి. నూహ్ లో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి.

దీంతో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి, శాంతిని నెలకొల్పడానికి నుహ్ జిల్లా యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో కొన్ని రోజుల కిందట పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి ఇంటర్నెట్ సర్వీస్ ను పునరుద్దరించారు. హింసాత్మక ప్రభావిత ప్రాంతాల్లో మార్కెట్లను కూడా తెరిచారు. ప్రజలు కూడా మార్కెట్ లను సందర్శిస్తున్నారు.

మద్యానికి డబ్బులిచ్చి.. చికెన్ కర్రీ వండి భర్తను ప్రియుడి దగ్గరికి పంపిన భార్య.. తరువాత ఏమైందంటే ?

హింస జరిగిన పది రోజుల తర్వాత అన్ని విద్యాసంస్థలను తెరవాలని జిల్లా మేజిస్ట్రేట్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పాఠశాలలు యథావిధిగా నడుస్తున్నాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పోలీసు పరేడ్ యూనిట్లు కూడా సిద్ధమవుతున్నాయి. 

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. క్షణాల్లో కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ.. వీడియో వైరల్

కొన్ని రోజుల కిందట హింస చెలరేగిన ప్రాంతాల్లో రాష్ట్ర రవాణా బస్సుల సేవలను పునరుద్ధరించారు. దీంతో ప్రజలకు చాలా ఉపశమనం లభించిందని, ఇతర గమ్యస్థానాలకు వెళ్లడానికి వారికి ఇప్పుడు ఎలాంటి సమస్య లేదని డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం