పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై భారీ జరిమానా పడింది. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన కొన్ని సంస్థలు ఇందులో ఖాతాలు నిర్వహిస్తున్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ. 5.49 కోట్ల జరిమానా వేసింది.
Paytm Payment Bank: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిందని పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ భారీ జరిమానా విధించింది. రూ. 5.49 కోట్ల ఫైన్ వేసింది. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన కొన్ని శక్తుల ఖాతాలను ఈ బ్యాంకులో మెయింటెయిన్ చేసినటటు తెలిసింది. పలు సంస్థలు గ్యాంబ్లింగ్ సహా ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాయి. అవి పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో ఖాతాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై సమీక్షను ప్రారంభించింది.
ఇది వరకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29వ తేదీ నాటికి పేటీఎం పేమెంట్ బ్యాంకులు క్రమంగా తన కార్యకలాపాలు నిలిపేయలని ఆదేశించింది. ఈ గడువును ఆ తర్వాత మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
గవర్నెన్స్ కోసం తమ షేర్ హోల్డర్ల అగ్రిమెంట్‌ను సులభతరం చేయడానికి పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ అంగీకరించిందని ఈ కంపెనీ వివరించింది. పేటీఎం, పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ రెండు కూడా బిలియన్ విజయ్ శేఖర్ శర్మ ఫిన్‌టెక్ సామ్రాజ్యంలో భాగం. అయితే.. ఈ బ్యాంక్‌ను పేటీఎం నియంత్రించడం లేదు.