మంత్రి భార్య , కుమార్తెకు కరోనా

Published : Jun 23, 2020, 10:50 AM ISTUpdated : Jun 23, 2020, 10:52 AM IST
మంత్రి భార్య , కుమార్తెకు కరోనా

సారాంశం

తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్‌-19 టెస్ట్‌ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్‌ ఫలితాలు రావడం దురదృష్టకరమని మంగళవారం మంత్రి ట్వీట్‌ చేశారు.

కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ దేశంలో కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులకు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ గజగజలాడిస్తోంది.

తాజాగా..కర్ణాటక వైద్యవిద్యా శాఖ మంత్రి కే సుధాకర్‌ భార్య, కుమార్తెకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా మంత్రి తండ్రికి నిర్వహించిన కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన మరుసటి రోజే వారికి పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్‌-19 టెస్ట్‌ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్‌ ఫలితాలు రావడం దురదృష్టకరమని మంగళవారం మంత్రి ట్వీట్‌ చేశారు.

ప్రసుత్తం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి సుధాకర్‌ పేర్కొన్నారు. తనకు తన ఇద్దరు కుమారులకు కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న సుధాకర్‌ తండ్రికి సోమవారం నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌