ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఒకరికి కరోనా: చికిత్సకు తరలింపు

By narsimha lode  |  First Published Jun 23, 2020, 11:17 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా సోకింది. దీంతో కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు.



న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా సోకింది. దీంతో కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు.తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న వారికి కరోనా సోకిన విషయం నిర్ధారణ కావడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరోవైపు కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా  మెలిగిన వారు ఎవరెవరనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వారందరిని కూడ ఇంటి వద్దే ఉండాలని  అధికారులు సూచించారు.ఈ ఏడాది మే మాసంలో ఢిల్లీలో పనిచేస్తున్న ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకు కరోనా సోకింది. 

Latest Videos

undefined

ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ జర్నలిస్టులకు సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవాళ్టికి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 40 వేలకు చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 14,933 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మహారాష్ట్రలో  అత్యధిక కేసులు నమోదయ్యాయి.1,35,796 కరోనా కేసులతో మహారాష్ట్రలో రికార్డయ్యాయి.

 

click me!