
ఎప్పుడైనా దొంగ పట్టుబడినప్పుడు 'నన్ను వదలొద్దు' అని ప్రజలకు విజ్ఞప్తి చేయడం మీరు చూశారా? లేదు కదా..! కానీ, ఓ దొంగ మాత్రం దొంగతనం చేస్తూ పట్టుబడి.. తనను విడిచిపెట్టండి. దొంగతనం చేయలేదు అనడానికి బదులు.. దయచేసి నన్ను వదిలిపెట్టకండి.. గట్టిగా పట్టుకోండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. అసలేం జరిగిందో తెలిస్తే.. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
అసలేం జరిగిందంటే.. కదులుతున్న రైలులో నుంచి మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించాడు ఒక దొంగ.
కానీ, అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే అతని చేతులను గట్టిగా పట్టుకున్నారు. ఎంత వదిలించుకుందాం అనుకున్నా.. వారు ఆ దొంగ చేతిని అసలు విడిచి పెట్టలేదు. అప్పటికే.. ఆ రైలు వేగం అందుకుంది. ఇంకా ఏం చేయలేని ఆ దొంగ సుమారు పది కిలోమీటర్ల వరకు.. రైలు కంపార్ట్‌మెంట్ కిటికీ బయటవైపు ప్రమాదకర స్థితి వేలాడుతూ ప్రయాణించాడు. ఈ ఘటన బీహార్‌లోని ఖగారియాలో జరిగింది.
ఈ నెల 14న బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో ఓ దొంగ.. కదులుతున్న రైలు కిటికిలో నుంచి ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. వెంటనే అప్రమత్తమైన ఆ ప్రయాణికుడు.. ఆ దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ దొంగ మాత్రం తనని తాను రక్షించుకోవడానికి తన శక్తి కొద్ది ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయాణికుడు మాత్రం ఆ దొంగను మాత్రం విడిచిపెట్టలేదే.. ఆ రైలు ప్లాట్ ఫామ్ చివరకు చేరగా తనను క్షమించి.. విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయినా.. ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టలేదు. గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నారు.
అప్పటికే రైలు వేగాన్ని అందుకుంది. ఏం చేయలేని ఆ దొంగ... ఆ బోగి కిటికీ బయటవైపు ప్రమాదకర స్థితిలో వేలాడావల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆ దొంగ తనను వదిలిపెట్టవద్దని, లేకుంటే చనిపోతానని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఆ దొంగపై జాలిపడి జనం ఆ దొంగను గట్టిగా పట్టుకున్నారు. ఇలా దాదాపు.. ఆ రైలు 15 కిలో మీటర్ల దూరం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణించాల్సి వచ్చింది. చివరిగా.. ఖగారియా స్టేషన్ సమీపిస్తుండగా ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టారు. దీంతో ఆ దొంగ..
బతుకు జీవుడా అని.. అక్కడి నుంచి ప్రాణాలు చేతిలో పెట్టుకుని.. అక్కడి నుంచి పరుగులు తీశారు.
మరోవైపు.. ఆ బోగిలో ప్రయాణిస్తున్న మరికొందరు ప్రయాణికులు.. తమ మొబైల్ ఫోన్లలో ఈఘటనను రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో .. దొంగ నిస్సహాయత స్థితిని, అతని నొప్పి అతని ముఖం నుండి కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెట్టిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ.. షేర్ చేస్తున్నారు.