
తమిళనాడులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తాను సినిమా నిర్మాతననీ, సినిమాల్లో ఆఫర్ ఇస్తానని నమ్మించి.. తాను మైనర్‌గా ఉన్నప్పుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ యువతి ఆరోపిస్తుంది. ఈ మేరకు కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన యువతి 2019లో సినిమాలో హీరోయిన్ ఆఫర్‌కు సంబంధించిన ప్రకటనను చూసి.. సంప్రదించింది. వారు తనను ఆడిషన్ కోసం లాడ్జికి రావాలని కోరారు. వారి మాటలు నమ్మిన ఆ యువతి ఒంటరిగా లాడ్జికి వెళ్లింది. నిర్మాతనని చెప్పుకునే నిందితుడు పార్తీబన్ తనకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్న తరువాత తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది.
సృహలోకి వచ్చిన తరువాత.. తనకు 18 ఏళ్లు నిండిన తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని ఆఫర్ ఇచ్చాడని, ఆ తర్వాత సినిమాలో ప్రధాన పాత్రను ఆఫర్ చేస్తానని, జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పవద్దని అన్నాడనీ. ఈ ఘటన 2019 డిసెంబర్ 22న జరిగిందని ఆ యువతి ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
ఈ క్రమంలో కోయంబత్తూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఇద్దరం కలిసి 15 నెలల పాటు సహజీవనం చేశామనీ, ఈ క్రమంలో తాను గర్భం దాల్చితే.. ఆ నిందితుడు బలవంతంగా అబార్షన్ చేయించాడని ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొంది. ఈ క్రమంలో తీవ్రంగా ఒత్తిడి చేయడంతో 2020 నవంబర్‌లో తనను వివాహం చేసుకున్నాడని నిర్మాత పార్తీబన్ చెప్పడని తెలిపింది. కానీ, తనని కాకుండా.. పార్తీబన్ మరో యువతిని వివాహం చేసుకున్నట్లు తెలియడంతో చీటింగ్ కేసుతో పాటు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశానని తెలిపింది.
కానీ, ఆ యువతి ఆరోపణలను నిందితుడు పార్తీబన్ తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఆ యువతి పలుమార్లు తన దగ్గర డబ్బు తీసుకుని మోసగించిందని ఆరోపించాడు. కాగా, ఈ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.