ప్రయాణికుడి బాంబు బెదిరింపు.. ముంబైలో అత్యవరంగా ల్యాండ్ అయిన అకాసా విమానం...

By SumaBala Bukka  |  First Published Oct 21, 2023, 2:12 PM IST

తన బ్యాగ్‌లో బాంబు ఉందని ఒక ప్రయాణికుడు చెప్పడంతో పూణే నుండి ఢిల్లీకి వెళ్లే ఆకాశ ఎయిర్ విమానం శనివారం తెల్లవారుజామున 12.42 గంటలకు ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. 


ముంబై : ముంబై విమానాశ్రయంలో హైడ్రామా చోటు చేసుకుంది. అకాసా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పడంతో 185 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన అకాసా విమానం ఈ తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

పూణే నుండి ఢిల్లీకి వెడుతున్న ఆకాసా ఎయిర్ విమానం శనివారం అర్ధరాత్రి 12.42 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. “నా బ్యాగ్‌లో బాంబు ఉంది” అని ఓ ప్రయాణికుడు చెప్పడంతో ఇది చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్ (BDDS) బృందాన్ని పిలిపించి, విమానంలో అతని బ్యాగ్‌ని తనిఖీ చేయించారు. కానీ బాంబు దొరకలేదు.

Latest Videos

అబద్దం చెప్పి ఇబ్బంది, భయాందోళనలకు గురిచేసిన ఆ ప్రయాణికుడిని విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి అకాసా ఎయిర్ నుంచి నుండి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. దీని ప్రకారం... “అకాసా ఎయిర్ ఫ్లైట్ QP 1148, పూణె నుండి 2023 అక్టోబర్ 21న అర్ధరాత్రి 12.07 గంటలకు బయలుదేరింది. 185 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది"

పాపులర్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేచెల్ చేజ్ అనుమానాస్పద మృతి...

“వెంటనే భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని ముంబైకి మళ్లించారు. కెప్టెన్ అవసరమైన అన్ని అత్యవసర విధానాలను పాటించారు. 12.42 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు, ”అని అకాసా ఎయిర్ ప్రకటన తెలిపింది.

దీనికి సంబంధించి పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. “ఈ సంఘటన గురించి ముంబై పోలీస్ కంట్రోల్‌కి సిఐఎస్ఎఫ్ అధికారి శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు సమాచారం అందించారు, ఆ తర్వాత ఆ విమానంలోని సదరు ప్రయాణీకుడి సామాను తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ బీడీడీఎస్ బృందంతో పాటు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. తనిఖీల్లో పోలీసులకు అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.

ఆ విమానంలో అతనితో పాటు ప్రయాణికుడి బంధువు కూడా ప్రయాణిస్తున్నట్లు అధికారి తెలిపారు. అతడిని విచారంగా సదరు వ్యక్తి ఛాతీ నొప్పికి మందు వేసుకున్నాడని.. దానివల్ల మత్తులో ఏదేదో మాట్లాడాడని పోలీసులకు తెలిపాడు. క్షుణ్ణంగా విచారించిన అనంతరం ఉదయం 6 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి విమానం ఢిల్లీకి బయలుదేరింది. ముంబై పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.
 

click me!