యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం..

Published : Oct 21, 2023, 12:53 PM IST
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. జిల్లాలోని గ్రేటర్ నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం అర్దరాత్రి దాటిన తర్వాత కారును గుర్తుతెలియని వాహనం ఢీట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు  చెబుతున్నారు. 

ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన  బాధితులు ఢిల్లీలో నివాసం ఉంటున్నారని తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని.. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..