
పవిత్ర రంజాన్ మాసంలో (ramadan 2022) రోజంతా ఉపవాసం (Ramzan fast0 వుండే ముస్లిం సోదరులు.. సాయంత్రం తమ దీక్షను విరమించి భోజనం చేస్తారు. దీనిని ఇఫ్తార్ (iftar) అంటారు. ఈ విందులో ఎవరి స్తోమతను బట్టి వారు రకరకాల వంటకాలను చేర్చుతారు. అయితే వివిధ రకాల కారణాలు, ప్రయాణాల్లో వున్న వారికి ఇఫ్తార్‌లో పాల్గొనడం కుదరదు. ఈ నేపథ్యంలో ప్రయాణంలో వున్న ఓ వ్యక్తికి ఇఫ్తార్ విందును అందజేసి ప్రశంసలు అందుకుంటోంది ఇండియన్ రైల్వే (indian railways) . అసలేం జరిగిందంటే.. షానావాజ్ అక్తర్ (shahnawaz akthar) అనే వ్యక్తి శతాబ్ది రైలులో ప్రయాణించారు. తనకు టీ కావాలని.. కానీ ఉపవాసం కావడం వల్ల కొంచెం ఆలస్యంగా తీసుకురమ్మని ప్యాంట్రీ సిబ్బందికి చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్లు ఇఫ్తార్ విందు తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారు. దాంతో అక్తర్ చాలా ఆనందపడి.. ఆ విషయాన్ని ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు భారతయ రైల్వేకి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ధన్‌బాద్‌లో హౌరా శతాబ్ది ఎక్కిన వెంటనే స్నాక్స్ (Howrah-Ranchi Shatabdi Express ) తీసుకున్నానని చెప్పాడు. తాను ఉపవాసం ఉన్నందున కొంచెం ఆలస్యంగా టీ తీసుకురావాలని ప్యాంట్రీ సిబ్బందికి చెప్పానని అక్తర్ తెలిపాడు. అతను మీరు ఉపవాసంలో ఉన్నారా..? అని అడిగాడని... తాను అవునని తల ఊపానని చెప్పాడు. తర్వాత మరొకరు ఇఫ్తార్‌తో వచ్చారని షానవాజ్ అక్తర్ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని కేంద్ర రైల్వే సహాయ మంత్రి దర్శన జర్దోష్ కామెంట్ చేశారు. మీరు ఆ విందును ఆరగించారని అనుకుంటున్నానని మంత్రి ఆకాంక్షించారు.
అయితే రైల్వే శాఖ ఇలాంటి విందులను ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. 2019లో రాంచీ హౌరా శతాబ్ది రైలులో ఇఫ్తార్ విందును అందజేశారు. ఆ విషయాన్ని అభిషేక్ శుక్లా అనే వ్యక్తి ట్విట్టర్‌లో పంచుకున్నారు. అలాగే దసరా శరన్నవరాత్రి వేళలో ప్రయాణికులకు ప్రత్యేక ఆహారాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.